Homeబిజినెస్​Gold Rates Today | ప‌సిడి ప్రియుల‌కి అదిరిపోయే శుభ‌వార్త‌.. దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు

Gold Rates Today | ప‌సిడి ప్రియుల‌కి అదిరిపోయే శుభ‌వార్త‌.. దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త మూడు రోజులుగా బంగారం Gold ధ‌ర‌లు స్వ‌ల్పంగా త‌గ్గుతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. బులియన్ మార్కెట్‌లో ఒక్కోసారి ధరలు పెరిగితే.. మరికొన్ని సార్లు తగ్గుతూ వస్తుంటాయి.

గత నెల లక్ష మార్కు దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల రూ.95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే రూ.98వేల వరకు చేరుకుంది. కాని గ‌త మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు దిగొస్తున్నాయి. మే 30 2025 శుక్రవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.97,030 ఉండగా.. 22 క్యారెట్ల ధర 88,940లుగా ఉంది.. రెండు రోజుల్లోనే పది గ్రాములపై రూ.800 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.100 తగ్గి.. రూ.99,800 లకు చేరింది.

హైదరాబాద్‌(Hyderabad)లో 24 క్యారెట్ల బంగారం(24-carat gold) ధర రూ.97,030గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.88,940లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,800లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,030గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.88,940లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,10,800. ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,180గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,090లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.99,800లుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,030, 22 క్యారెట్ల ధర రూ.88,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.

చెన్నై(Chennai)లో 24 క్యారెట్ల ధర రూ.97,030, 22 క్యారెట్ల ధర రూ.88,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,800లుగా ఉంది. బెంగళూరు(Bangalore)లో 24 క్యారెట్ల ధర రూ.97,030, 22 క్యారెట్ల ధర రూ.88,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.99,800లుగా ఉంది.

అంతర్జాతీయ మార్కెట్‌(international market)లో కూడా బంగారం, వెండి ధరలు దిగొస్తున్నాయి. డాలర్ Dollar బలపడుతోందన్న సంకేతాలు, లాభాల స్వీకరణ వంటి పరిణామాలతో గత కొన్ని రోజులుగా ఇదే ట్రెండ్ కనిపిస్తోంది. అమెరికా ఆర్థిక వ్యవస్థ పుంజుకుంటోందని ఫెడరల్ రిజర్వ్ ఇటీవలే ప్రకటించ‌గా, ట్రంప్ ప్రతీకార సుంకాలపై అమెరికా కోర్టు(US court) బ్రేకులు వేయడం కూడా బంగారం ధరల పతనానికి కారణమయ్యింది.

Must Read
Related News