అక్షరటుడే, వెబ్‌డెస్క్: బంగారం కొనుగోలు చేయాలని ఎవరైన అనుకుంటున్నారా.. అయితే వారికి కొంత ఊరట లభించిందని చెప్పవచ్చు.
ఎందుకంటే పసిడి ధరలు స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. కానీ, ఇదే సమయంలో వెండి రేట్లు పుంజుకోవడం విశేషం. బంగారం Gold rate, వెండి ధరలలో హెచ్చుతగ్గులు గత కొద్ది రోజులుగా గమనిస్తూనే ఉన్నాం. ఇటీవల 95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. మళ్లీ నాలుగైదు రోజుల్లోనే 98వేల మార్క్‌కు చేరుకున్నాయి. తాజాగా బంగారం ధర స్వల్పంగా తగ్గాయి. వెండి ధర మాత్రం పెరిగింది. మే 27 2025 మంగళవారం ఉదయం వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ.97,630 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,490 పలుకుతోంది. పది గ్రాముల బంగారంపై రూ.10 మేర పెరిగింది. వెండి కిలో ధర రూ.100 పెరిగి, రూ.1,00,100లకు చేరింది.
Today Gold Price : శాంతించిన బంగారం..
హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.97,630గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,490లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర హైదరాబాద్‌లో రూ.1,11,100లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,630గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ. 89,490లుగా ఉంది.
కిలో వెండి Silver ధర రూ.1,11,100 లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.97,780గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.89,640లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,00,100లుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.97,630, 22 క్యారెట్ల ధర రూ.89,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,00,100లు పలుకుతోంది.
చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.97,630, 22 క్యారెట్ల ధర రూ.89,490 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,11,100. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.97,630, 22 క్యారెట్ల ధర రూ.89,490. వెండి ధర కిలో రూ.1,00,100లుగా ఉంది.
బంగారం ధరలు తగ్గినప్పటికీ, వెండి ధరలు మాత్రం స్వల్పంగా పెరగడం విశేషం. ఈ క్రమంలో ఢిల్లీలో ప్రస్తుతం కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ. 1,00,100 మార్కును తాకింది. ఇక హైదరాబాద్ Hyderabad, వరంగల్, తిరుపతి, విజయవాడలో కిలో వెండి ధర రూ.100 పెరిగి రూ.111,100 స్థాయికి చేరుకుంది. ఇదే సమయంలో చెన్నై, కేరళ, భువనేశ్వర్, త్రివేండ్రం ప్రాంతాల్లో వెండి ధరలు రూ.111,100గా ఉన్నాయి. వారణాసి, గోవా, నోయిడా, రాజ్ కోట్, మైసూర్, సూరత్, ముంబై, పాట్నా ప్రాంతాల్లో కేజీ వెండి రేట్లు రూ.1,00,100గా ఉన్నాయి.