Homeబిజినెస్​Gold Price | ద‌డ పుట్టిస్తున్న బంగారం ధర.. ఒక్క‌సారిగా ఇంత పెరిగిందేంటి..!

Gold Price | ద‌డ పుట్టిస్తున్న బంగారం ధర.. ఒక్క‌సారిగా ఇంత పెరిగిందేంటి..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price | ప‌సిడి Gold ప‌రుగులు పెడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా వీటి ధరలు రికార్డు స్థాయికి చేరుకుంటున్నాయి. జూన్ నెల ప్రారంభంలోనే భారతదేశంలో బంగారం ధరలు భారీ ఎత్తున పెరిగాయి. ఇటీవ‌ల కాస్త త‌గ్గిన‌ట్టు అనిపించింది. కానీ మ‌ళ్లీ ప‌రుగులు పెడుతుంది. మంగళవారం (జూన్‌ 3)న దేశీయంగా బంగారం ధర(Gold Rate) పెరిగింది. జూన్‌ 2న ధరలతో పోల్చుకుంటే తులంపై ఏకంగా రూ. 1500 వరకు పెరిగింది. ప్రస్తుతం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.98,850 ఉండగా, 94 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.90,610 వద్ద కొనసాగుతోంది. ఇక వెండి విషయానికొస్తే కిలో ధర రూ.1,00,100 వద్ద ఉంది.

Gold Price | భ‌గ‌భ‌గ‌మంటున్న బంగారం..

హైద‌రాబాద్‌(Hyderabad)నగరంలో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 98,850, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 90,610.. 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ. 74,140గా ఉంది. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖ, విజయవాడలో Vijywada ఇవే ధరలు కొనసాగుతున్నాయి. దేశవ్యాప్తంగా బంగారం (24, 22 క్యారెట్ల) ధరలు చూస్తే.. కోల్‌కతా- రూ.98,850, రూ.90,610, చెన్నై- రూ.98,850, రూ.90,610, బెంగళూరు- రూ.98,850, రూ.90,610, పుణె- రూ. 98,850, రూ.90,610, అహ్మదాబాద్- రూ. 98,900, రూ.90,660, భోపాల్- రూ. 98,900, రూ.90,660, కోయంబత్తూర్- రూ. 98,850, రూ.90,610 గా ఉన్నాయి.

ఇక పాట్నా- రూ. 98,900, రూ.90,660, సూరత్- రూ. 98,900, రూ.90,660, పుదుచ్చెరి- రూ. 98,850, రూ.90,610గా ఉన్నాయి. ఈ రోజు వెండి ధ‌ర కూడా పెరిగి పెద్ద షాకే ఇచ్చింది. హైదరాబాద్‌లో Hyderabad కేజీ వెండి రూ. 100 పెరిగి.. రూ. 1,11,100గా ఉంది. దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,00,100కు చేరింది. ఆర్థిక రాజధాని ముంబైలో కిలో వెండికి రూ. 100 పెరిగి. రూ.1,00,100 వద్ద కొనసాగుతోంది. ఇక విజయవాడలో కేజీ ధర రూ.1,11,100గా ఉంది, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ. 1,11,100 వద్ద కొనసాగుతోంది