ePaper
More
    Homeబిజినెస్​Gold Price | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    Gold Price | స్థిరంగా బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్లు ఎలా ఉన్నాయంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్​డెస్క్: Gold Price | అంతర్జాతీయ పరిస్థితుల నేపథ్యంలో ఇటీవల బంగారం ధరలు(Gold Rates) విపరీతంగా పెరిగిన విషయం తెలిసిందే. యుద్ధ భయాల నేపథ్యంలో ఇన్వెస్టర్లు బంగారం వైపు మొగ్గు చూపారు. దీంతో పసిడి ధరలు(Gold Prices) పరుగులు పెట్టాయి. ఇజ్రాయిల్ ఇరాన్ యుద్ధం ముగియడంతో పాటు పరిస్థితులు సద్దుమనుగుతుండడంతో ఇన్వెస్టర్లు తిరిగి స్టాక్స్ లో పెట్టుబడులు పెట్టడం వైపు మొగ్గు చూపుతున్నారు. దీంతో పసిడిని విక్రయిస్తుండడంతో ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. మొన్నటి వరకు రూ. 1,02,00లకు పైగా పలికిన బంగారం Gold ధర ప్రస్తుతం రూ. 97వేలకు చేరుకుంది. ఈ రోజు ధ‌ర‌లు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర (10 గ్రాములు) రూ. 89,300గా ఉంది. గత కొన్ని రోజుల్లో ఇది వరుసగా రూ. 550, రూ. 850, రూ. 250, రూ. 1350, రూ. 50 చొప్పున తగ్గింది. అంటే బంగారం ధరలు క్రమంగా పడిపోతున్నాయి.

    Gold Price | ధ‌ర‌లు ఎలా ఉన్నాయి..

    అలాగే, 24 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 97,420 వద్ద ట్రేడ్ అవుతోంది. వెండి ధర కిలోకు రూ. 1,17,800 వద్ద స్థిరంగా ఉంది. గత 10 రోజులుగా ఎలాంటి మార్పులు లేవు. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)ల ప‌రంగా చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 97, 410, రూ. 89, 290గా ఉంది. విజయవాడలో Vijaywada రూ. 97, 410, రూ. 89, 290, ఢిల్లీలో రూ. 97, 560, రూ. 89, 440, ముంబైలో రూ. 97, 410, రూ. 89, 290, వడోదరలో రూ. 97, 460, రూ. 89, 340, కోల్‌కతాలో రూ. 97, 410, రూ. 89, 290, న్నైలో రూ. 97, 410, రూ. 89, 290గా ఉన్నాయి.

    ఇక బెంగళూరులో (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)ల ప‌రంగా చూస్తే.. రూ. 97, 410, రూ. 89, 290గా ఉంది. కేరళలో రూ. 97, 410, రూ. 89, 290 కాగా, పుణెలో రూ. 97, 410, రూ. 89, 290 పలుకుతోంది. ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 1,17,700గా ఉంది. విజయవాడలో రూ. 1,17,700, ఢిల్లీలో రూ. 1, 07, 700, చెన్నైలో రూ. 1,17,700, కోల్‌కతాలో రూ. 1, 07, 700, కేరళలో రూ. 1,17,700, ముంబైలో Mumbai రూ. 1,07,700, బెంగళూరులో రూ. 1,07,700, వడోదరలో రూ. 1,17,700, అహ్మదాబాద్‌లో రూ. 1,17,700గా ఉన్నాయి. బంగారం ధ‌ర‌లో త‌గ్గుద‌ల క‌నిపిస్తున్న నేప‌థ్యంలో ఇంట్రెస్ట్ ఉన్న‌వారు కొనుగోలు చేయ‌డం ఉత్త‌మం.

    More like this

    ACB Raid | రూ.4 లక్షల లంచం తీసుకుంటూ దొరికిన అధికారిణి

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : ACB Raid | అవినీతి అధికారులు రెచ్చిపోతున్నారు. కార్యాలయాలకు వచ్చే వారి నుంచి అందిన...

    Sub Collector Vikas Mahato | పీహెచ్​సీ సబ్​సెంటర్​ నిర్మాణం కోసం స్థల పరిశీలన

    అక్షరటుడే, కోటగిరి: Sub Collector Vikas Mahato | పోతంగల్ (Pothangal)​ మండలంలోని హెగ్డేలి(Hegdely) గ్రామానికి మంగళవారం బోధన్​...

    Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​.. పార్టీకి సొసైటీ ఛైర్మన్​ రాజీనామా

    అక్షరటుడే, బోధన్​: Maggari Hanmandlu | బీఆర్​ఎస్​కు షాక్​ తగిలింది. ఇటీవల పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్​...