Homeబిజినెస్​Today Gold Price | దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

Today Gold Price | దిగొస్తున్న బంగారం ధ‌ర‌లు.. ఇక ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కండి..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : ఎక్కడైనా ఎప్పుడైనా భారత మ‌హిళ‌లు బంగారంపై Gold ఎక్కువ ఆస‌క్తి చూపుతుండ‌టం మ‌నం చూస్తూనే ఉంటాం. పెళ్లిళ్లు, పండుగలు, పెట్టుబడుల కోసం బంగారం కొనుగోలు ఒక సంప్రదాయంగా మార‌గా, వీటి ధరలు ఎప్పటికప్పుడు మారుతుండ‌డం గమనార్హం.

ఇటీవల‌ లక్ష రూపాయల మార్కును దాటి పరుగులు పెట్టిన బంగారం ధరలు ఇప్పుడు కొంత తగ్గుముఖం ప‌డుతున్నాయి. ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో అంతర్జాతీయ మార్కెట్లలో బంగారం, వెండి ధరలు క్రమంగా దిగివస్తున్నాయి. రికార్డు స్థాయిలో పెరిగిన కొద్ది రోజుల్లోనే బంగారం ధర దాదాపు రూ.5,000 వరకు తగ్గడం విశేషం.

Today Gold Price : తగ్గుద‌ల‌..

ఒకానొక దశలో తులం బంగారం ధర రూ.1,02,000 దాటగా, ప్రస్తుతం అది దాదాపు రూ.97,000 వద్ద ఆగింది. మార్కెట్ నిపుణుల అంచనాల ప్రకారం, డిమాండ్ తగ్గడం, జియోపాలిటికల్ ఉద్రిక్తతలు తగ్గిన నేపథ్యంలో రానున్న రోజుల్లో ధరలు మరింత తగ్గే అవకాశం ఉంది.

అయినా.. బంగారం, వెండికి ఎప్పటికీ స్థిరమైన డిమాండ్ ఉంటుందనే విషయం మరవకూడదు. ధరలు ఒక్కోసారి తగ్గినా, తిరిగి పెరిగే అవకాశాలు ఎక్కువే ఉన్నాయి. జూన్ 29, 2025 (ఆదివారం) దేశవ్యాప్తంగా 24 క్యారెట్​ల బంగారం (10 గ్రాములు) – రూ.97,420 కాగా, 22 క్యారెట్​ల బంగారం (10 గ్రాములు) – రూ.89,300 గా ఉంది. ఇక వెండి (కిలో) – రూ.1,07,800 గా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు చూస్తే.. హైదరాబాద్ Hyderabad లో 24 క్యారెట్​లు – ₹97,420, 22 క్యారెట్​లు – ₹89,300, వెండి – ₹1,17,800 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్​లు – ₹97,420, 22 క్యారెట్​లు – ₹89,300 , వెండి – ₹1,17,800 ఉండ‌గా, ఢిల్లీలో 24 క్యారెట్​లు – ₹97,570, 22 క్యారెట్​లు – ₹89,450, వెండి – ₹1,07,800, ముంబయిలో 24 క్యారెట్​లు – ₹97,420, 22 క్యారెట్​లు – ₹89,300 , వెండి – ₹1,07,800, చెన్నైలో 24 క్యారెట్​లు – ₹97,420, 22 క్యారెట్​లు – ₹89,300, వెండి – ₹1,17,800, బెంగళూరులో 24 క్యారెట్​లు – ₹97,420, 22 క్యారెట్​లు – ₹89,300, వెండి – ₹1,07,800గా ఉంది. అయితే మార్కెట్ పరిస్థితులు మారుతున్నప్పటికీ, బంగారానికి ఉన్న విశ్వసనీయత, పెట్టుబడి విలువ కారణంగా దీని ధ‌ర‌లు పెరుగుతూనే ఉంటాయి.

Must Read
Related News