Homeబిజినెస్​Today Gold Price | దిగి వ‌స్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

Today Gold Price | దిగి వ‌స్తున్న బంగారం, వెండి ధ‌ర‌లు.. నేడు ఎంత ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధరలు ఈ మ‌ధ్య క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతూ పోతున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం, అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై ఒత్తిడి, ముడిచమురు ధరలు పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా చెబుతున్నారు. బులియన్ మార్కెట్‌లో పసిడి, వెండికి ఎప్పుడూ డిమాండే ఉంటుంది. వీటి ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్వల్పంగా తగ్గాయి. జూన్ 25 2025 బుధవారం ఉదయం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్​ల బంగారం Gold పది గ్రాముల ధర రూ. 99,210 ఉండగా.. 22 క్యారెట్​ల ధర 90,940 గా ఉంది.

Today Gold Price : స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

వెండి కిలో ధర రూ.1,08,900 పలుకుతోంది. బంగారం తులంపై రూ.10, వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది. అయితే.. ఈ ధరలు ఎప్పటికప్పుడు మారుతుంటాయి.. ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో చూస్తే.. హైదరాబాద్‌ Hyderabad లో 24 క్యారెట్​ల బంగారం ధర రూ.99,210 ఉండగా.. 22 క్యారెట్​ల ధర రూ.90,940 పలుకుతోంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,18,900 గా ఉంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్​ల పసిడి ధర రూ.99,210 ఉంటే.. 22 క్యారెట్​ల ధర రూ.90,940 గా ఉంది. కిలో వెండి ధర రూ.1,18,900 పలుకుతోంది. ఢిల్లీలో 24 క్యారెట్​ల పసిడి ధర రూ.99,360, 22 క్యారెట్​ల ధర రూ.91,090 గా కొనసాగుతోంది. మరోవైపు కిలో వెండి Silver ధర రూ.1,08,900 గా ఉంది.

ముంబయిలో Mumbai 24 క్యారెట్​ల ధర రూ.99,210, 22 క్యారెట్​ల ధర రూ.90,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,08,900 పలుకుతోంది. చెన్నైలో 24 క్యారెట్​ల ధర రూ.99,210 ఉండగా.. 22 క్యారెట్​ల ధర రూ.90,940 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,18,900గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్​ల ధర రూ.99,210, 22 క్యారెట్​ల ధర రూ.90,940గా ఉంది. వెండి ధర కిలో రూ.1,08,900 పలుకుతోంది. ఈ ధ‌ర‌లు ప్రాంతాల‌ను బ‌ట్టి మారుతుంటాయి. ఈ మ‌ధ్య బంగారం ధ‌ర ల‌క్ష మార్కుకి చేరుకోగా, ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గుతూ వ‌స్తోంది.