Homeబిజినెస్​Today Gold Price | కాస్త తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్లు ఎంతంటే..!

Today Gold Price | కాస్త తగ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు రేట్లు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం ధ‌ర‌లు ల‌క్ష మార్క్ ట‌చ్ అయ్యాయి.గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌ల‌లో పెరుగుద‌ల క‌నిపిస్తుందే త‌ప్ప త‌గ్గిన‌ట్టు ఏమి క‌నిపించ‌డం లేదు. త‌గ్గినా కాస్త త‌గ్గుతుంది అంతే. దేశంలో ఇటీవల లక్ష రూపాయలకు చేరుకున్న 10 గ్రాముల పసిడి ధరలు (gold rates on june 23rd 2025) ఇంకా అలాగే కొనసాగుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీటి ధరలు భారీగా పుంజుకున్నాయి. కానీ నేడు (జూన్ 23, 2025న) గత ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గుముఖం పట్టాయి. డాలర్‎తో పోల్చుకుంటే రూపాయి విలువ పెరగడం, మార్కెట్‌లో స్థిరత్వం వంటి పలు అంశాల కారణంగా దేశీయ మార్కెట్లో పసిడి ధరలు తగ్గే ఛాన్స్ ఉంది.

Today Gold Price : స్వ‌ల్పంగా త‌గ్గాయి..

జూన్ 23, 2025న ప‌లు ప్రాంతాల‌లో బంగారం Gold ధ‌ర‌లు చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్​ల బంగారం ధర రూ.1,00,740 ఉండగా.. 22 క్యారెట్​ల ధర రూ.92,340 గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్​ల పసిడి ధర రూ.1,00,740 ఉంటే.. 22 క్యారెట్​ల ధర రూ.92,350 గా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్​ల పసిడి ధర రూ.1,00,900, 22 క్యారెట్​ల ధర రూ.92,500 గా ఉంది. ముంబయిలో 24 క్యారెట్​ల ధర రూ.1,00,740 , 22 క్యారెట్​ల ధర రూ.92,340 గా ఉంది. చెన్నైలో 24 క్యారెట్​ల ధర రూ.1,00,740 ఉండగా.. 22 క్యారెట్​ల ధర రూ.92,340 గా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్​ల ధర రూ.1,00,740 , 22 క్యారెట్​ల ధర రూ.92,340 గా ఉంది.

ఇకపోతే, దేశంలో ఇవాళ్టి వెండి Silver ధర పరిశీలించినట్టయితే.. గ్రాము రూ.119.90లు ఉండగా, కిలో వెండి ధర రూ.1,19,900 గా ఉంది. ఢిల్లీలో కేజీ వెండి ధర రూ. 100 తగ్గి రూ.1,09,900 స్థాయికి చేరుకుంది. ఇక చెన్నై, హైదరాబాద్‎లో రూ. 1,19,900 గా ఉంది. మరోవైపు పుణేలో రూ.109,900లో ఉండగా, బెంగళూరు, వడోదర, కేరళ, ఢిల్లీలో కూడా రూ.109,900 స్థాయిలో ఉంది. స్టాక్ మార్కెట్లు ప్రారంభమైన తర్వాత బంగారం, వెండి రేట్లలో మార్పులు జరిగే అవకాశం ఉంది. కాబట్టి వీటిని కొనుగోలు చేసే ముందు వీటి ధరలను తప్పక తెలుసుకోవాలి.