Homeబిజినెస్​Today Gold Price | దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. ఎంత త‌గ్గిందో తెలుసా?

Today Gold Price | దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. ఎంత త‌గ్గిందో తెలుసా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : గ‌త రెండు మూడు రోజులుగా బంగారం ధ‌ర‌లు ప‌రుగులు పెడుతున్నాయి. బంగారం (gold), వెండి (silver) ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరువలో ట్రేడ్ అవుతున్నాయి. భౌగోళికంగా ఉద్రిక్త పరిస్థితులే బంగారం పెరుగుదలకు కారణంగా కనిపిస్తోంది. అయితే నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తోంది. ఇటీవల లక్ష రూపాయలు దాటిన బంగారం ధరలు.. తర్వాత 95 వేల వరకు దిగి వచ్చాయి. అయితే గత రెండు రోజుల నుంచి తులం బంగారం ధర లక్ష రూపాయలు దాటేసింది. ఏకంగా లక్షా 2వేలకుపైగా ఎగబాకింది. ఇక వెండి ధర కూడా అంతే.. కిలో వెండి ధర లక్షా 10 వేలకుపైగా వెళ్లింది.

Today Gold Price : కాస్త త‌గ్గుద‌ల‌..

ఈ రోజు (జూన్ 18న) 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1,00,360కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 91, 990కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే దాదాపు వెయ్యి రూపాయల మేర బంగారం ధర తగ్గింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1, 00, 510కి చేరుకోగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 92, 140కి చేరుకుంది. ఇక హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,00,360కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 91,990కి చేరింది. వెండి Silver ధరలు కేజీకి రూ.100 మేర పెరిగాయి.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) ప్ర‌కారం ధ‌ర‌లు చూస్తే..

హైదరాబాద్‌(Hyderabad)లో రూ. 1,00,360 , రూ. 91,990 , విజయవాడలో రూ. 1,00,360, రూ. 91,990 , ఢిల్లీలో రూ. 1,00,510, రూ. 92,140, ముంబై(Mumbai)లో రూ. 1,00,360 , రూ. 91,990, వడోదరలో రూ. 1,00,410, రూ. 92,040, కోల్‌కతా(Kolkata)లో రూ. 1,00,360, రూ. 91,990, చెన్నైలో రూ. 1,00,360, రూ. 91,990, బెంగళూరులో రూ. 1,00,360, రూ. 91,990, కేరళలో రూ. 1,00,360, రూ. 91,990, పుణెలో రూ. 1,00,360, రూ. 91,990గా ఉన్నాయి.

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 1,20,100, విజయవాడలో రూ. 1,20,100, ఢిల్లీలో రూ. 1,10,100, చెన్నైలో రూ. 1,20,100, కోల్‌కతాలో రూ. 1,20,100, కేరళలో రూ. 1,20,100, ముంబైలో Mumbai 1,10,100 , బెంగళూరులో రూ.1,10,100, వడోదరలో రూ. 1,10,100, అహ్మదాబాద్‌లో రూ. 1,10,100గా ఉన్నాయి.