HomeUncategorizedGold Price | భ‌గ‌భ‌గ‌మంటున్న బంగారం ధ‌ర‌లు..రికార్డ్ క్రియేట్ చేశాయిగా…!

Gold Price | భ‌గ‌భ‌గ‌మంటున్న బంగారం ధ‌ర‌లు..రికార్డ్ క్రియేట్ చేశాయిగా…!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్:Gold Price | గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు(Gold Rates) పైపైకి పోతుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. పశ్చిమాసియా ఉద్రిక్తతలతో శుక్రవారం బులియన్‌ మార్కెట్‌(Bullion Market) రేసుగుర్రంలా పరిగెత్తింది. శనివారం అయితే బంగారం ధరలో భారీ పెరుగుదల కనిపించింది. దేశ రాజధాని ఢిల్లీ(Delhi)లో నిన్నటికి ఇప్పటికి పోలిస్తే బంగారం ధర 10 గ్రాములకు రూ.2200 పెరిగి రూ.1,01,560కి చేరుకుంది, ఇది ఇప్పటివరకు ఉన్న రికార్డు స్థాయికి చాలా దగ్గరగా ఉంది. పెళ్లిళ్ల సీజన్ మధ్య, బుల్లెట్ రైలు వేగంతో బంగారం ధర పెరుగుతోంది.ఆల్ ఇండియా సరాఫా అసోసియేషన్ ప్రకారం.. 99.5 శాతం స్వచ్ఛమైన 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర లక్షా 14100 రూపాయల వద్ద ట్రేడవుతోంది.

Gold Price | త‌గ్గేదే లే..

అదే 22 క్యారెట్ల పది గ్రాముల ధర 92,960 రూపాయల వద్ద కొనసాగుతోంది. ఇక వెండి ధర విషయానికొస్తే 1 లక్షా 10 వేల 100 రూపాయల వద్ద ఉంది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరల వివరాలు చూస్తే.. చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,410 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92, 960 రూపాయల వద్ద కొనసాగుతోంది.ముంబై(Mumbai)లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,410 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92, 960 రూపాయల వద్ద కొనసాగుతోంది.హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,410 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92, 960 రూపాయల వద్ద కొనసాగుతోంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,410 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92, 960 రూపాయల వద్ద కొనసాగుతోంది.బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 1,01,410 రూపాయల వద్ద ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర 92, 960 రూపాయల వద్ద కొనసాగుతోంది. బంగారం ధర పెరగడానికి అతిపెద్ద కారణం ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక, రాజకీయ పరిస్థితులు బాగా లేకపోవడమే.భారతదేశంలో బంగారం ధర ప్రపంచవ్యాప్తంగా ప్రస్తుత బంగారం రేటు, డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ, ప్రభుత్వం దానిపై విధించే పన్ను వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.