అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today Gold Price : ప్రపంచ వాణిజ్య ఉద్రిక్తతలు తగ్గడం, సురక్షితమైన పెట్టుబడికి డిమాండ్ అంతగా లేకపోవడం వలన బంగారం ధరలు (Gold rates) తగ్గుతూ వస్తున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే స్వల్పంగా తగ్గిందనే చెప్పాలి.
శనివారం నాటికి 24 క్యారెట్ల (24-carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.300కు పైగా తగ్గి రూ.1,00,470 వద్ద కొనసాగుతోంది. అలాగే, 22 క్యారెట్ల బంగారం (22-carat gold) ధర సుమారు రూ.200 తగ్గి రూ.92,090 వద్ద ఉంది.
ఇది నిన్నటితో పోల్చితే స్వల్ప తగ్గుదలే అయినప్పటికీ, బంగారం ధరలు ఇంకా ఒక లక్ష రూపాయల పైనే కొనసాగుతున్నాయి. ఈ ధరలు బంగారు ఆభరణాల కొనుగోలు చేస్తున్న వారికి మాత్రం తీవ్ర భారంగా మారుతున్నాయి.
Today Gold Price : కాస్త తగ్గిన ధరలు..
22 క్యారెట్ల ధర కూడా 93 వేల రూపాయలకు చేరువగా ఉండడంతో, సామాన్యులకు అందని ద్రాక్షలా మారింది. బంగారం ధరలు ఈ స్థాయికి చేరడానికి ప్రధానంగా అంతర్జాతీయ ఆర్థిక పరిస్థితులే కారణమని నిపుణులు విశ్లేషిస్తున్నారు.
బంగారంతో పాటు వెండి ధర కూడా స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం కిలో వెండి ధర (Silver rates) రూ.1,00,117 వద్ద ఉండగా, హైదరాబాద్, చెన్నై, కోల్‌కతాలలో ఇది రూ.1,27,000 వరకు ఉండడం గమనార్హం. వెండి ధర భారీగా పెరగడానికి ప్రధాన కారణం… పారిశ్రామికంగా వెండి డిమాండ్ పెరగడమే అని నిపుణులు చెబుతున్నారు.
- ఢిల్లీ (Delhi) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0620 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,240 వద్ద ట్రేడ్ అవుతుంది.
- ఇక ముంబయి (Mumbai) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 గా ఉంది.
- హైదరాబాద్ (Hyderabad) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 గా ట్రేడ్ అయింది.
- చెన్నైలో (Chennai) 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 గా ఉంది.
- బెంగళూరు (Bangalore) లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 గా ఉంది, ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 వద్ద కొనసాగుతుంది.
- విజయవాడ (Vijayawada) లో24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.10,0470 ఉండగా, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.92,090 వద్ద ట్రేడ్ అవుతుంది.