అక్షరటుడే, వెబ్‌డెస్క్: Today gold price | బంగారం ధరలు(Gold rate) మహిళలతో దోబూచులాడుతున్నాయి. తగ్గినట్టే తగ్గి పెరుగుతుండడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. సమ్మర్‌లో కొంత పెళ్లిళ్ల హడావిడి ఉంటుంది. బంగారం కొనాలని చాలా మంది చూస్తుంటారు. ఇలా బంగారం ధరలు పెరుగుతుండడం వారిని కొంత ఆందోళనకు గురి చేస్తుంది. భారతదేశంలో బంగారం, వెండి ధరలు gold rates today may 23rd 2025 ఈరోజు కూడా భారీగా పెరిగాయి. ఈ క్రమంలో చెన్నై, ముంబై, హైదరాబాద్, కోల్‌కతా, ఢిల్లీ వంటి ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అమెరికన్ డాలర్(American dollar), యూఎస్ ట్రెజరీ(US Treasury) దిగుబడులు రెండు వారాల కనిష్ట స్థాయికి పడిపోవడంతో బంగారాన్ని సురక్షిత ఆస్తిగా పరిగణించి ఇన్వెస్టర్లు కొనుగోళ్లు చేస్తున్నారు.
Today gold price | తగ్గేదే లే..
మే 23, 2025న gold rates today ఉదయం 6.35 గంటల సమయానికి హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ. 490 పెరిగి రూ. 97,920కి చేరుకుంది. ఇదే సమయంలో 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.450 వృద్ధి చెంది రూ. 89,760కి చేరింది. ఈ నేపథ్యంలో దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 98,070కి చేరగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,910కు చేరుకుంది. వెండి ధరలు కూడా అదే బాటలో పయనించాయి. ఈ క్రమంలో కిలో వెండి ధర ఢిల్లీలో 100 రూపాయలు పెరిగి రూ. 1,01,000కి చేరుకుంది. మరోవైపు హైదరాబాద్, వరంగల్, విజయవాడ, తిరుపతిలో కిలో వెండి ధర రూ.1000 పెరిగి రూ.112,100కు చేరింది.
చెన్నై, కేరళ Kerala ప్రాంతాల్లో కూడా సిల్వర్ రేట్లు రూ.1,12,100గా ఉన్నాయి. నాసిక్, నోయిడా, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై ప్రాంతాల్లో వెండి రేట్లు రూ. 1,01,000 స్థాయికి చేరుకున్నాయి. ఇదే సమయంలో అంతర్జాతీయ మార్కెట్‌లో స్పాట్ గోల్డ్ ధర 0.7% పెరిగి ఔన్స్‌కు $3,336.43కు చేరుకుంది. ఇది మే 9 తర్వాత గరిష్ట స్థాయికి చేరుకుంది. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు, అమెరికాలో ఆర్థిక లోటు ఆందోళనలు సహా ఇండియాలో పలు అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేశాయి.