HomeUncategorizedGold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఇలా అయితే కొనేదెట్టా?

Gold Price | మ‌ళ్లీ పెరిగిన బంగారం ధ‌ర‌లు.. ఇలా అయితే కొనేదెట్టా?

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్ :Gold Price | అంతర్జాతీయ ప‌రిస్థితుల దృష్ట్యా గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు(Gold Rates) హెచ్చు తగ్గుల‌కి గుర‌వుతున్న విష‌యం మ‌న‌కు తెలిసిందే.

అమెరికా డాలర్ బలపడడం, ఆసియా మార్కెట్లలో డిమాండ్ తగ్గడం వంటి అంశాలు బంగారం ధరలను ప్రభావితం చేసే అవకాశం ఉంది. అలానే వివాహాలు(Mariiages) తగ్గ‌డం పండుగలు లేక‌పోవ‌డం వ‌ల‌న కూడా బంగారంకు Gold డిమాండ్ తగ్గుతుంది. అయితే మే 22, 2025న ఉదయం నాటికి బంగారం, వెండి ధరలు భారీగా పెరిగి, పెద్ద‌ షాక్ ఇచ్చాయి. ఈ రోజు ఉదయం 6.30 గంటల సమయానికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.97,430కి చేరింది. 22 క్యారెట్ పసిడి ధర రూ.89,310కి చేరుకుంది.

Gold Price | ఎందుకు ఇలా?

ఇదే సమయంలో దేశ రాజధాని ఢిల్లీలో Delhi 10 గ్రాముల 24 క్యారెట్ గోల్డ్ రేటు రూ. 97,580కి చేరుకోగా, 22 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 89,460కు చేరింది. బంగారంతో పాటు, వెండి ధరలు కూడా ఈ రోజు భారీగా పెరిగాయి. ఈ క్రమంలో ఢిల్లీలో వెండి ధర కిలోకు రూ.2,000 పెరిగి, రూ.1,00,100కు చేరుకుంది. ఇక హైదరాబాద్, వరంగల్, తిరుపతి, విజయవాడలో కిలో వెండి ధర రూ.2,100 పెరిగి రూ.1,11,100కు చేరుకుంది. ఈ నేపథ్యంలో చెన్నై, కేరళ ప్రాంతాల్లో కూడా వెండి ధరలు రూ.1,11,100గా ఉన్నాయి. మరోవైపు నోయిడా, నాసిక్, మైసూర్, సూరత్, నాగ్ పూర్, పాట్నా, జైపూర్, ముంబై ప్రాంతాల్లో వెండి రేట్లు రూ.1,00,100కు చేరాయి.

బంగారం ధ‌ర‌లు(Gold Prices) చూస్తే.. చెన్నైలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.89,310 కాగా, 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.97,430గా ఉంది. ముంబైలో బంగారం ధరలు చెన్నైతో సమానంగా ఉన్నాయి. 22 క్యారెట్ బంగారం ధర ఒక గ్రాముకు రూ.8,930గా ఉండగా, 24 క్యారెట్ రూ.9,743గా ఉంది. ఢిల్లీలో 22 క్యారెట్ బంగారం ధర 10 గ్రాములకు రూ.8,9460 ఉండగా, 24 క్యారెట్ గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ.97,580కి చేరుకుంది. బెంగళూరు Bangalore, హైదరాబాద్, కేరళ, పూణే, వడోదరలో 22 క్యారెట్ 24 క్యారెట్ బంగారం ధరలు వరుసగా 10 గ్రాములకు రూ.89,310, రూ.97,430 స్థాయిలో ఉన్నాయి. డాలర్ ఇండెక్స్‌లో హెచ్చుతగ్గులు, రష్యా-ఉక్రెయిన్ ఒప్పందం వంటి పలు కారణాలతో ధ‌ర‌ల‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి మార్కెట్ విశ్లేషకులు అంటున్నారు.