Homeతాజావార్తలుToday Gold Prices | పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్​.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర!

Today Gold Prices | పెళ్లిళ్ల సీజన్ ఎఫెక్ట్​.. మళ్లీ పెరుగుతున్న బంగారం ధర!

Today Gold Prices | భారతీయులకు బంగారం అనేది వారి సంప్రదాయం, ఆచారంలో ఒక భాగం. పండుగ అయినా, శుభకార్యం అయినా బంగారం కొనడం సంప్రదాయంగా కొనసాగుతోంది.

- Advertisement -

అక్షరటుడే, హైదరాబాద్​: Today Gold Prices | భారతీయులకు బంగారం అనేది కేవలం ఆభరణం మాత్ర‌మే కాదు, అది వారి సంప్రదాయం, ఆచారంలో ఒక భాగం.

పండుగ అయినా, శుభకార్యం అయినా బంగారం కొనడం సంప్రదాయంగా మారిపోయింది. ఇప్పుడు పెళ్లిళ్ల సీజన్ కొనసాగుతుండడంతో బంగారంకి డిమాండ్ పెరిగింది.

దేశవ్యాప్తంగా పెళ్లిళ్ల సీజన్ మొదలవడంతో బంగారం ధరలు Gold Prices మళ్లీ ప‌రుగులు పెడుతున్నాయి. రెండు రోజుల క్రితం ఒక్కరోజే రూ.1500 తగ్గి మహిళలకు ఊరటనిచ్చిన గోల్డ్ రేట్లు, నిన్న మళ్లీ పెరిగాయి.

ఇక ఈ రోజు కూడా స్వల్పంగా పెర‌గ‌డం జ‌రిగింది. తాజా సమాచారం ప్రకారం, ప్రస్తుతం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,22,560, 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,12,360గా ఉంది. నిన్నటితో పోల్చితే బంగారం ధరలు రూ.10 మేర పెరిగాయి.

Today Gold Prices | ధ‌ర‌లు పైపైకి..

తెలుగు రాష్ట్రాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. హైదరాబాద్ లో Hyderabad 24 క్యారెట్ల బంగారం (10గ్రా) – రూ.1,22,410గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల బంగారం (10గ్రా) – రూ.1,12,210, 18 క్యారెట్ల బంగారం – రూ.91,810గా ఉంది.

నిన్నటి ధరలతో పోలిస్తే, ఒక్కో కేటగిరీలో రూ.10 పెరిగింది. ఇక విజయవాడలో 24 క్యారెట్ల బంగారం – రూ.1,22,410 కాగా, 22 క్యారెట్ల బంగారం – రూ.1,12,210, ఇక్కడ కూడా ధరలు రూ.10 పెరిగాయి.

ఇక ఇతర రాష్ట్రాల్లో తమిళనాడు: 24 క్యారెట్ల బంగారం – రూ.1,23,560గా న‌మోదు కాగా, బెంగళూరు: 24 క్యారెట్ల బంగారం – రూ.1,22,410, 22 క్యారెట్ల – రూ.1,12,210గా ట్రేడ్ అయింది.

మ‌రోవైపు వెండి ధరలు Silver Prices కూడా పైకి పోతుండ‌డం క‌ల‌వ‌ర‌ప‌రుస్తుంది. ఈ రోజు బంగారంతో పాటు వెండి ధరలు కూడా స్వల్పంగా పెరిగాయి.

హైదరాబాద్‌లో ప్రస్తుతం తులం వెండి – రూ.1,661గా న‌మోదు కాగా, కిలో వెండి – రూ.1,66,100 (నిన్నటి కంటే రూ.100 పెరిగింది). అలానే విజయవాడలో కూడా ఇదే ధరలు నమోదయ్యాయి.

ఇక ఢిల్లీలో తులం వెండి రూ.1,521గా ఉంది. విశ్లేషకుల ప్ర‌కారం.. పెళ్లిళ్ల సీజన్ వ‌ల‌న డిమాండ్‌ పెరగడంతో పాటు అంతర్జాతీయ మార్కెట్లలో డాలర్‌ బలపడటం, జియోపాలిటికల్ టెన్షన్స్ వంటి అంశాలు కూడా బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి. రానున్న రోజుల‌లో బంగారం ధ‌ర‌లు మ‌రింత పెరిగే అవ‌కాశం క‌నిపిస్తుంది.