ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇలా పరుగులు...

    Today Gold Price | త‌గ్గిన‌ట్టే త‌గ్గి మ‌ళ్లీ పెరుగుతున్న బంగారం ధ‌ర‌లు.. ఇలా పరుగులు పెడుతున్నాయేంటి..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : బంగారం Gold ధ‌ర‌లు త‌గ్గినట్టే తగ్గి మ‌ళ్లీ వెంట‌నే పెరుగుతూ పోతున్నాయి. కొందామ‌ని ప్లాన్ చేసేలోపే ఇలా బంగారం ధ‌ర‌లు పెర‌గ‌డం సామాన్యుల‌కి ఏ మాత్రం మింగుడుప‌డ‌టం లేదు. గత నెలలో స్వల్పంగా తగ్గిన బంగారం ధరలు ఇప్పుడు మళ్లీ ఆకాశాన్ని అంటుతున్నాయి.

    గత నెలలో రూ.93,000 వద్ద ట్రేడ్ అయిన 24 క్యారెట్ల స్వచ్ఛమైన బంగారం (24-carat pure gold) ధర ప్రస్తుతం రూ.99,340 వద్దకు చేరింది. ఈ ధోరణి చూస్తే త్వరలోనే రూ.1,00,000 మార్క్‌ను దాటే అవకాశం స్పష్టంగా కనిపిస్తోంది. ఇక 22 క్యారెట్ల బంగారం (22-carat pure gold) ధర రూ.91,060 వద్ద ట్రేడ్ అవుతోంది.

    Today Gold Price : భ‌గ్గుమంటున్న బంగారం..

    ఇదే సమయంలో 18 క్యారెట్ల బంగారం(18-carat pure gold) ధర రూ.74,510 వద్ద ఉంది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం గ్రాముకు రూ.1 చొప్పున, 10 గ్రాములకు రూ.10 పెరుగుదల నమోదైంది. ధరలు ప్రతి రోజూ క్రమంగా పెరుగుతుండటంతో వినియోగదారులు కొనుగోలు చేయాలా.. లేక వేచి చూడాలా.. అనే గందరగోళంలో ఉన్నారు.

    ఇటీవలి వరకూ తగ్గుతూ వచ్చిన వెండి ధరలు కూడా ఇప్పుడు పెరిగి ప్రజలకు ఊహించని షాక్ ఇచ్చాయి. నిన్న హైదరాబాద్‌లో Hyderabad 100 గ్రాముల వెండి ధర రూ.12,100 కాగా, ఇప్పుడు రూ.12,110కి చేరింది. కిలో వెండి ధర రూ.1,21,000 నుంచి రూ.1,21,100కి పెరిగింది. అంటే ఒక్కరోజులోనే 100 గ్రాముల వెండి ధర రూ.10 పెరిగింది.

    బంగారం, వెండి Silver ధరల పెరుగుదలతో గోల్డ్ షాపుల ద‌గ్గ‌ర‌ రద్దీ తక్కువగా కనిపిస్తోంది. ముఖ్యంగా పెళ్లిళ్లు, పండుగల సమయాల్లో బంగారం కొనుగోలు చేసే వారు ధరలు మరింత పెరుగుతాయ‌నే భయంతో ముందుగానే కొనుగోలు చేసేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు. కాస్త త‌గ్గిన కూడా వెంట‌నే బంగారం కొనుగోలు చేస్తున్నారు.

    ఆ మ‌ధ్య బంగారం ల‌క్ష కూడా ట‌చ్ కావ‌డం మ‌నం చూశాం. ఇప్పుడు దేశ రాజధాని ఢిల్లీ(DELHI)లో 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 91,210గా ఉంది. అలానే 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,490 వద్ద ట్రేడ్ అయింది. ఇక ముంబయి(MUMBAI)లో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ. 91,060గా ఉండ‌గా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 99,340గా న‌మోదైంది.

    అలాగే బెంగళూరు(BENGALURU)లో 10 గ్రాముల 22 క్యారెట్స్‌ గోల్డ్‌ ధర రూ. 91,060కాగా, 24 క్యారెట్ల గోల్డ్‌ ధర రూ. 99,340 గా ఉంది. హైదరాబాద్‌లో శుక్రవారం 22 క్యారెట్ల తులం బంగారం ధర రూ. 91,060 కాగా, 24 క్యారెట్ల బంగారం ధర రూ. 99,340 వద్ద ట్రేడ్ అయింది.. అలాగే విజయవాడ (VIJAYAWADA)తో పాటు విశాఖపట్నంలోనూ అవే ధరలు కొనసాగుతున్నాయి.

    More like this

    greenfield road | 12 వ‌రుస‌ల గ్రీన్‌ఫీల్డ్ ర‌హ‌దారి నిర్మాణానికి సీఎం విన్నపం.. అందుబాటులోకి వస్తే మార్గంలో పండుగే!

    అక్షరటుడే, హైదరాబాద్: greenfield road : భార‌త్ ఫ్యూచ‌ర్ సిటీ నుంచి అమ‌రావ‌తి మీదుగా బంద‌రు పోర్ట్ వ‌ర‌కు...

    Vice Presidential election | ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్.. విపక్ష కూటమి ఎంపీలపై అనుమానం!

    అక్షరటుడే, న్యూఢిల్లీ: Vice Presidential election : ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి NDA candidate సీపీ...

    Train to halt at Cherlapalli | పండుగల నేపథ్యంలో సౌత్ సెంట్రల్ రైల్వే కీలక నిర్ణయం.. ఆ రైలుకు చర్లపల్లిలో హాల్ట్

    అక్షరటుడే, హైదరాబాద్: Train to halt at Cherlapalli : రానున్న దసరా, దీపావళి, ఛఠ్ పర్వదినాల సీజన్‌ను...