Homeబిజినెస్​Today gold price | పైపైకి ప‌సిడి ధరలు.. ఇలా అయితే కొనేదెలా..!

Today gold price | పైపైకి ప‌సిడి ధరలు.. ఇలా అయితే కొనేదెలా..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | బంగారం Gold ధ‌ర‌లు మ‌ళ్లీ పుంజుకుంటున్నాయి. త‌గ్గిన‌ట్టే త‌గ్గి ఒక్క‌సారిగా ధ‌ర‌లు పెరుగుతుండ‌డంతో సామాన్యులు ల‌బోదిబోమంటున్నారు. ఇటీవల కాలంలో గతంలో ఎన్నడూ లేని విధంగా బంగారం ధరలు భారీగా పెరిగాయి. ఏప్రిల్ నెలలో ఏకంగా లక్ష దాటిన పసిడి ధరలు.. ఆ తర్వాత తగ్గినట్లే తగ్గి మళ్లీ పెరుగుతున్నాయి. ఇటీవల కాలంలో లక్ష నుంచి రూ.95వేల వరకు దిగొచ్చిన పసిడి ధరలు.. ఆ తర్వాత కొన్ని రోజుల్లోనే రూ.99 వేలు దాటింది. ఈ క్రమంలోనే.. తాజాగా బంగారం, వెండి ధరలు మళ్లీ పెరుగుతుండ‌డం ఆందోళ‌న క‌లిగిస్తుంది. జూన్ 05 2025 గురువారం నమోదైన ధరల ప్రకారం.. 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.99,180 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,910 గా ఉంది.

Today gold price | పరుగులు పెడుతున్న బంగారం..

10 గ్రాముల గోల్డ్ ధర(Gold rate)పై రూ.10 మేర పెరిగింది. వెండి కిలో ధర రూ.100 పెరిగి.. రూ.1,02,100లుగా ఉంది. ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే.. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.99,180గా ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.90,910 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి Silver ధర రూ.1,13,100లుగా ఉంది. విజయవాడ(Vijayawada), విశాఖపట్నం(Vishakapatnam)లో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,180 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.90,910లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,13,100 లుగా ఉంది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.99,330, 22 క్యారెట్ల ధర రూ.91,060 లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,02,100లుగా ఉంది.

ముంబైలో (Mumbai) 24 క్యారెట్ల ధర రూ.99,180, 22 క్యారెట్ల ధర రూ.90,910 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,02,100లుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.99,180, 22 క్యారెట్ల ధర రూ.90,910 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,13,100లుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.99,180, 22 క్యారెట్ల ధర రూ.90,910 గా ఉంది. వెండి ధర కిలో రూ.1,02,100 లుగా ఉంది. ఈ రేంజ్‌లో బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతూ పోతే సామాన్యులు ఇక వాటివైపు చూసేది కూడా క‌ష్ట‌మే.