అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Rates | గత కొన్ని వారాలుగా రికార్డు స్థాయిలో దూసుకెళ్లిన బంగారం Gold ధరలు కాస్త తగ్గుముఖం పట్టాయి. జూలై 26న హైదరాబాద్‌తో (Hyderabad) పాటు దేశవ్యాప్తంగా పసిడి ధరలు గణనీయంగా పడిపోయాయి. లక్ష మార్కును తాకి వినియోగదారులను దిగ్భ్రాంతికి గురి చేసిన బంగారం ధరలు ప్రస్తుతం మళ్లీ ఆ మైలు రాయి దిగువకు చేరాయి. ప్రస్తుతం హైదరాబాద్ మార్కెట్‌లో (Hyderabad market) బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.99,930 కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.91,600గా ఉన్నాయి. అలాగే 18 క్యారెట్లు (10 గ్రాములు) రూ.74,950గా ట్రేడ్ అయింది. ఇదే క్రమంలో వెండి ధర కూడా తగ్గింది. గ్రాము వెండి ధర రూ.116 కాగా, కిలో వెండి ధర రూ.1,16,000గా నమోదైంది.
Gold Rates | భారీ తగ్గుదల..
విజయవాడలో (Vijayawada) 10 గ్రాముల 24 క్యారట్ల బంగారం ధర రూ.99,930 దగ్గర ట్రేడ్ కాగా, 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర (Gold rate) రూ.91,600 పలుకుతోంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.74,950 గా ట్రేడ్ అయింది. అంతర్జాతీయంగా అమెరికాలో సుంకాల చర్చలు, వాణిజ్య ఒప్పందాల్లో కనిపిస్తున్న సానుకూల పరిణామాలు గోల్డ్ రేటుపై ప్రభావం చూపిస్తున్నాయి.
ప్రపంచవ్యాప్తంగా పెట్టుబడిదారులు ఇప్పుడు బంగారంకన్నా స్టాక్ మార్కెట్‌పై (Stock Market) ఎక్కువ ఆసక్తి చూపుతుండడంతో బులియన్ మార్కెట్‌లో ఒత్తిడి పెరిగింది. పెట్టుబడిదారులు గోల్డ్‌లో లాభాల బుకింగ్ ప్రారంభించడం కూడా ఈ తగ్గుదలకు మరో కారణమని నిపుణులు చెబుతున్నారు. ఇతర నగరాల్లో గోల్డ్ ధరలు చూస్తే.. ముంబై, బెంగళూరు, చెన్నైలలో కూడా రూ. లక్షకు దిగువన ధరలు నమోదు అయ్యాయి. ఢిల్లీ(Delhi)లో మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పటికీ రూ.1,00,080 వద్ద కొనసాగుతోంది.
ప్రతి రోజూ కూడా మార్కెట్ ప్రకారం, ప్రాంతాల వారీగా ధరల్లో స్వల్ప మార్పులు చోటు చేసుకుంటుండడం మనం గమనిస్తూనే ఉన్నాం. బంగారం, వెండి ధరల్లో (Silver Rate) ఈ తాజా మార్పులు శ్రద్ధగా గమనించి ఈ సమయంలో కొనుగోలు చేయాలా? వేచి చూడాలా? అనే నిర్ణయం నిపుణుల సూచనల ప్రకారం తీసుకోవడం ఉత్తమమని విశ్లేషకులు సూచిస్తున్నారు.