Homeబిజినెస్​Today gold price | ప‌సిడి ప్రియులకు శుభ‌వార్త‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌..!

Today gold price | ప‌సిడి ప్రియులకు శుభ‌వార్త‌.. స్వల్పంగా తగ్గిన బంగారం ధ‌ర‌..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | ఆపరేషన్ సిందూర్ తర్వాత బంగారం Gold ధరల్లో మార్పులు చోటు చేసుకుంటుండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. గ‌తంలో ల‌క్ష రూపాయ‌ల‌కు చేరుకుంది బంగారం ధ‌ర‌. యుద్ధం త‌ర్వాత త‌గ్గుతూ వ‌స్తున్నాయి. స్వచ్ఛమైన 24 క్యారెట్ల బంగారం ధర ఇప్పుడు 96 వేల దగ్గర ట్రేడ్ అవుతోంది. పరిస్థితులను చూస్తుంటే ధరలు మరింత తగ్గే అవకాశం కనిపిస్తోంది. బంగారం కొనాలనుకునే వారికి.. పెట్టుబడులు పెట్టాలనుకునే వారికి ఇది సరైన సమయం అని అంటున్నారు. ఏడాది పొడవునా బంగారాన్ని కొనుగోలు చేయడానికి ఆసక్తిని చూపించేవారు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా ఇప్పుడు కొనేయ‌డం బెట‌ర్.

Today gold price | స్వ‌ల్పంగా త‌గ్గుద‌ల‌..

అంతర్జాతీయ మార్కెట్​లో డాలర్ బలపడడంతో నేడు బంగారం ధర స్వల్పంగా తగ్గింది. ఈ క్రమంలో ఈ రోజు(మే 14 వ తేదీ) గురువారం బంగారం ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం. హైదరాబాద్​లో గురువారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 88,040 ఉండగా.. 24 క్యారెట్ల (మేలిమి బంగారం) 10 గ్రాముల బంగారం ధర రూ.96,050 లుగా కొనసాగుతోంది. ఇవే ధరలు తెలుగురాష్ట్రాల్లో ప్రధాన నగరాలైన రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, వరంగల్, పొద్దుటూరులలో కొనసాగుతున్నాయి. దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88,040గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.96,200 లుగా ఉంది. దేశ ఆర్ధిక రాజధాని ముంబై (Mumbai)లో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 88,040 వద్ద ఉంది.

24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 96,050 వద్ద కొనసాగుతోంది. ఇవే ధరలు దేశంలో ప్రధాన నగరాలైన కేరళ, కోల్ కతా, పూణే, బెంగళూరు లో కూడా కొనసాగుతున్నాయి. బంగారంతో పాటు వెండి Silver కూడా మంచి ఆదరణ ఉంది. ఎటువంటి సందర్భం వచ్చినా బహుమతులుగా వెండి వస్తువులు ఇవ్వడానికి ఆసక్తిని చూపిస్తారు. అయితే గతంలో కంటే ఇప్పుడు వెండితో రకరకాల ఆభరణాలను తయారు చేస్తున్నారు. ఇవి నేడు ట్రెండీగా నిలుస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిలో వెండి ధర ఒకానొక సమయంలో రూ. లక్ష దాటింది .

దేశ వ్యాప్తంగా పసిడి బాటలో నడుస్తూ వెండి ధర స్వల్పంగా దిగి వచ్చింది. ఈ నేపథ్యంలో గురువారం కేజీ వెండి ధర రూ. 1,08,900లు ఉండగా.. ఇదే ధర కేరళ, చెన్నై లో కూడా ఉంది. అయితే దేశ రాజధాని ఢిల్లీలో కిలో వెండి ధర రూ. 97,800 ఉంది. ఇదే ధర కోల్ కతా, బెంగుళూరు లో కొనసాగుతోంది. హైదరాబాద్ నగరంలో బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ నిత్యం తగ్గుతూనే వస్తున్నాయి.