అక్షరటుడే, వెబ్డెస్క్: Gold price |బంగారం ధరలు తగ్గుతూ పెరుగుతూ వస్తున్నాయి. . గత నెలలో లక్ష దాటిన బంగారం ధర, మే నెలలో కాస్త తగ్గుతూ వచ్చింది. బంగారం ధరలు తగ్గుతున్నాయని సామాన్యులు సంతోషపడే లోపే మళ్లీ బంగారం ధరలకు రెక్కలు వస్తున్నాయి. ధరలు రోజు రోజుకి క్రమ క్రమంగా పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్వల్ప హెచ్చుతగ్గులు మినహా సామాన్యులకు అందనంత ఎత్తులోనే ఉంటున్నాయి. గుడ్ రిటర్న్ వెబ్‌సైట్ ప్రకారం, నేడు Gold Rates on May 25, 2025 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.98,080గా ఉంది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 89,900గా ఉంది. ఇక 10 గ్రాముల 18 క్యారెట్ల బంగారం ధర రూ.73,560. కిలో వెండి ధర రూ 99,900గా ఉంది.
Gold price | కొనడం కష్టమే..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (24కే,22కే,18కే) ప్రకారం చూస్తే.. చెన్నై: ₹9,808 ₹8,990 ₹7,410, ముంబై: ₹9,808 ₹8,990 ₹7,356, ఢిల్లీ: ₹9,823 ₹9,005 ₹7,368, కోల్‌కతా: ₹9,808 ₹8,990 ₹7,356, బెంగళూరు: ₹9,808 ₹8,990 ₹7,356, హైదరాబాద్: ₹9,808 ₹8,990 ₹7,356, కేరళ: ₹9,808 ₹8,990 ₹7,356, పూణే: ₹9,808 ₹8,990 ₹7,356, వడోదరా: ₹9,813 ₹8,995 ₹7,360, అహ్మదాబాద్: ₹9,813 ₹8,995 ₹7,360 గా ఉన్నాయి. మళ్ళీ బంగారం ధరలు పెరుగుతున్న క్రమంలో సామాన్య , మధ్య తరగతి ప్రజలు నిరాశకు లోనవుతున్నారు. బంగారం Gold ధరలు తగ్గితే కొనుగోలు చేసుకుందాం అని భావించిన వారు ధరలు పెరుగుతున్న క్రమంలో బంగారం ధరలు ఇలా పెరిగితే కొనుగోలు చేయటం కష్టమే అంటున్నారు.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ జూన్ 1 నుంచి యూరోపియన్ యూనియన్ దిగుమతులపై 50 శాతం టారిఫ్ విధించనున్నట్లు ప్రకటించిన సంగతి విదితమే. యూరోపియన్ యూనియన్ సుంకాలపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిపై ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో పలు మార్పులు చోటు చేసుకోబోతున్నాయి. ముఖ్యంగా బంగారం ధరల్లో మార్పులు చోటు చేసుకోనున్నాయి. 2025 జూన్ 1 నుండి యూరోపియన్ Europian యూనియన్ నుండి దిగుమతులపై 50 శాతం సుంకం విధించాలనే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రతిపాదనపై పెట్టుబడిదారుల ఉద్రిక్తతలు తిరిగి పెరగడంతో భారతదేశంలో బంగారం ధరలు, అమెరికాకు చెందిన కామెక్స్ బంగారం ధరలు పెరిగాయి.