Gold Price on August 30 | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. కాస్త శాంతిస్తున్న వెండి
Gold Price on August 30 | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి.. కాస్త శాంతిస్తున్న వెండి

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | గ‌త కొద్ది రోజులుగా బంగారం Gold ధ‌ర‌ల‌లో హెచ్చు త‌గ్గులు మ‌నం గ‌మ‌నిస్తూనే ఉన్నాం. ఒక‌సారి భారీగా పెర‌గిన బంగారం ధ‌ర మ‌రో రోజు కాస్త త‌గ్గుతుంది. కొద్ది రోజుల నుంచి బంగారం ఉరుకులు పెట్టింది. ఇప్పుడిప్పుడే కాస్త త‌గ్గుతుంది. గత వారం రోజులుగా బంగారం ధరలలో(Gold price) అంతగా పెరుగుదల కనిపించడం లేదు. ఈ క్ర‌మంలో బంగారం కొనుగోలుపై చాలా మంది ఆస‌క్తి చూపుతున్నారు. శుక్రవారం ఉదయం దేశీయ మార్కెట్లో(Indian markets) బంగారం ధరలు స్వల్పంగా తగ్గాయి. గురువారం 22 క్యారెట్ల పసిడి రూ.87,750 ఉండగా.. ఈరోజు 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్(Gold price) రూ.87,740 చేరింది. అలాగే 24 క్యారెట్ల గోల్డ్ రూ.95,730 .. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.95,720 చేరింది.

Today gold price | నిలకడగా బంగారం ధర..

హైదరాబాద్ మార్కెట్లో శుక్రవారం ఉదయం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,720కు చేరింది. అలాగే విజయవాడ, విశాఖపట్నం, నెల్లూరు, నిజామాబాద్, వరంగల్ వంటి నగరాల్లో ఇవే ధరలు కొనసాగుతున్నాయి. ముంబైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర(22 carat gold) రూ.87,740, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్(24 carat gold) రూ.95,720కు చేరింది. ఢిల్లీలో Delhi 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,890, 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.95,587కు చేరింది. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720వద్ద కొనసాగుతుంది. కోల్ కత్తాలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,740, 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720కు చేరింది.

అలాగే బెంగుళూరులో 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రేట్ రూ.87,740 ఉండగా.. 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం రూ.95,720కు చేరింది.కేరళ Kerala, పూణె, వడోదర, అహ్మదాబాద్ వంటి నగరాల్లోనూ ఇవే ధరలు కొనసాగుతున్నాయి. బంగారం అంటే కేవ‌లం ఒక వ‌స్తువు మాత్ర‌మే కాదు, అదొక ఎమోష‌న్‌. ఇంట్లో బంగారం ఉంటే అంద‌రికి ఒక ధీమా ఉంటుంది. అందుకే చాలా మంది బంగారాన్ని కొన‌డానికి ఇష్ట‌ప‌డుతుంటారు. అక్ష‌య తృతీయ(Akshaya Tritiya) రోజు భారీగా బంగారం కొనుగోళ్లు జ‌రిగాయి.