- Advertisement -
Homeబిజినెస్​Gold Prices on sep | కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఏయే నగరాల్లో...

Gold Prices on sep | కాస్త త‌గ్గిన బంగారం, వెండి ధ‌ర‌లు.. ఏయే నగరాల్లో ఎలా ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices on sep | దేశంలో బంగారం, వెండి ధరలు Silver Prices ఎల్లప్పుడూ మార్కెట్‌లో హాట్ టాపిక్‌గా ఉంటాయి. నిన్నటితో పోల్చితే ఈరోజు ఉదయం నాటికి ధరలు స్వల్పంగా తగ్గాయి.

నేడు (సెప్టెంబరు 22, 2025) ఉదయం న‌మోదైన ధ‌ర‌ల ప్ర‌కారం చూస్తే హైదరాబాద్, ముంబయి నగరాల్లో 24 క్యారెట్ బంగారం 10 గ్రాములకు రూ.10 తగ్గి రూ.1,12,140కి చేరగా, 22 క్యారెట్ 10 గ్రాములకు రూ.1,02,790కి చేరింది.

- Advertisement -

వెండి కిలో ధర కూడా హైదరాబాద్, కేరళ KERALA లో రూ.100 తగ్గి రూ.1,34,900గా నమోదైంది. ఇదే సమయంలో దేశంలోని ఇతర నగరాల్లో ధరలు ఎలా ఉన్నాయో చూద్దాం..

Gold Prices on sep | స్వ‌ల్ప త‌గ్గింపు..

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ బంగారం ధ‌ర 10 గ్రాములు రూ.1,12,290, చెన్నైలో రూ.1,12,250గా, కోల్‌కతా, పుణెలో రూ.1,12,140, బెంగళూరు, వడోదరలో రూ.1,12,140గా ఉన్నాయి.

వెండి ధరల విషయానికొస్తే బెంగళూరులో ఒక కిలో రూ.1,33,500, హైదరాబాద్, చెన్నై, కేరళలో రూ.1,44,900, ఢిల్లీ, ముంబయి, కోల్‌కతా, పుణె, వడోదరలో రూ.1,34,900గా ఉన్నాయి.

ధరలు నగరాన్నిబట్టి మారుతున్నాయి. బంగారం ధరలు ఢిల్లీలో అత్యధికంగా ఉండగా కోల్‌కతా, పుణె, బెంగళూరు, వడోదరలో కొంత తక్కువగా ఉన్నాయి.

వెండి ధరలు హైదరాబాద్, చెన్నై, కేరళలో ఎక్కువగా ఉండగా బెంగళూరులో తక్కువగా ఉన్నాయి. నిపుణుల ప్రకారం రానున్న దసరా, దీపావళి సీజన్ నేపథ్యంలో బంగారం కొనుగోళ్లు పెరిగే అవకాశం ఉంది.

సంప్రదాయం, సంస్కృతి, పెట్టుబడి వంటి అంశాల దృష్ట్యా బంగారానికి ఎల్లప్పుడూ డిమాండ్ ఉంటుందని, ఈ సీజన్‌లో బంగారం Gold కొనుగోలు ఆభరణాల కోసం మాత్రమే కాకుండా ఆర్థిక భద్రత కోసం కూడా ఉపయోగపడుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.

ఏది ఏమైనా ఈ మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర‌లు క్ర‌మేపి పెరుగుతూ పోతుండ‌టం సామాన్యుల‌కి ఆందోళ‌న క‌లిగిస్తోంది. ఇలా ధ‌ర‌లు పెర‌గుతూ పోతున్న నేప‌థ్యంలో విన‌యోగ‌దారులు గ‌గ్గోలు పెడుతున్నారు.

- Advertisement -
- Advertisement -
Must Read
Related News