Homeబిజినెస్​Gold Prices on 24th | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధర.. ఈ రోజు ఎంతంటే..!

Gold Prices on 24th | ప‌రుగులు పెడుతున్న ప‌సిడి ధర.. ఈ రోజు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Prices on 24th | భౌగోళిక రాజకీయ అనిశ్చితులు, రూపాయి క్షీణత ప్రభావంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారం ధరలు ఎగసిపడుతున్నాయి.

వరుసగా రికార్డులు సృష్టిస్తున్న పసిడి ఈ రోజు (సెప్టెంబరు 24) మరింత పెరిగింది. 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర Gold Price రూ. 1,15,700 కు చేరుకోగా, 22 క్యారెట్ల పది గ్రాముల ధర రూ. 1,06,060 గా నమోదైంది.

ఢిల్లీ DElhi లో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,850 కి చేరుకోగా, 22 క్యారెట్ల ధర రూ. 1,06,210 గా న‌మోదైంది. హైదరాబాద్‌, విజయవాడ, ముంబయి Mumbai, కోల్‌కతా, చెన్నై, బెంగళూరు, కేరళలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,700, 22 క్యారెట్ల ధర రూ. 1,06,060 గా నమోదైంది.

Gold Prices on 24th | భ‌య‌పెట్టిస్తున్న బంగారం..

వడోదరలో 24 క్యారెట్ల ధర రూ. 1,15,750 , 22 క్యారెట్ల ధర రూ. 1,06,110 గా ఉంది. మరోవైపు వెండి ధరలు కూడా పెరిగాయి.

కేజీ వెండి ధర హైదరాబాద్‌, విజయవాడ, చెన్నై, కేరళలో Kerala రూ. 1,50,100 గా ఉండగా ఢిల్లీలో, కోల్‌కతాలో, ముంబయి, బెంగళూరులో, వడోదర, అహ్మదాబాద్‌లో రూ. 1,40,100 గా నమోదైంది.

వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే కేజీకి వంద రూపాయల మేర పెరిగాయి. ఈ పెరుగుదల వల్ల పసిడి, వెండి కొనాలనుకునే వారు అయోమయంలో పడిపోతున్నారు.

పెట్టుబడిదారులు సురక్షిత పెట్టుబడి కోసం పసిడిని ఆశ్రయిస్తుండటంతో రాబోయే రోజుల్లో కూడా ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

దీపావళి Diwali నాటికి బంగారం ధరలు భారీగా పెరుగుతాయని నిపుణులు అంచ‌నాలు వేయ‌గా, దాని క‌న్నా ముందే ధరలు ఈ స్థాయికి చేరుకోవడం బంగారం ల‌వ‌ర్స్ ని ఆందోళనకు గురిచేస్తోంది.

బంగారం ధరలు పెరగడానికి ప్రధానంగా అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్నటువంటి పరిస్థితులే ముఖ్య కార‌ణం అని అంటున్నారు.

బంగారు ఆభరణాలు కొనుగోలు చేసే వారికి పెరిగిన ధరలు ఇబ్బందికరంగా ఉండ‌గా, ఇప్పుడు ఆ షాపుల వైపు పోవ‌డానికే జంకుతున్నారు.

Must Read
Related News