అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Rates | పసిడి పరుగులు ఆగడం లేదు. నిత్యం బంగారం రేట్లు పెరుగుతుండటంతో సామాన్యులు కొనలేని పరిస్థితి నెలకొంది.
గత కొన్ని రోజులుగా బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. దీంతో ప్రజలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. అంతర్జాతీయ అనిశ్చితుల కారణంగా చాలా మంది బంగారాన్ని సురక్షిత పెట్టుబడి (Investment) సాధనంగా భావిస్తున్నారు. ఈ క్రమంలో బంగారంపై అధిక మొత్తంలో ఇన్వెస్ట్ చేస్తున్నారు. దీంతో దేశీయంగా సైతం పసిడి ధరలకు రెక్కలు వచ్చాయి.
Gold Rates | నిజామాబాద్లో..
నిజామాబాద్ (Nizamabad) మార్కెట్లో సోమవారం 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,24,500 పలుకుతోంది. 22 క్యారెట్ల బంగారం రూ.1,14,885గా ఉంది. గత కొన్ని రోజుల్లోనే బంగారం ధరలు రూ.లక్ష నుంచి ఇంత భారీగా పెరగడం గమనార్హం. వెండి ధరలు (Silver Prices) సైతం భారీగా పెరుగుతున్నాయి. నిజామాబాద్లో కిలో వెండి 1,59,000 వద్ద ట్రేడ్ అవుతోంది. ఇలా ధరలు పెరిగితే బంగారం, వెండి ఎలా కొనాలని పేద, మధ్య తరగతి వారు ఆందోళన చెందుతున్నారు.
Gold Rates | తగ్గిన గిరాఖీ
బంగారం, వెండి ధరలు పెరగడంతో ఆభరణాల తయారీ దుకాణాలకు గిరాకీ తగ్గింది. దసరా సీజన్లో ఎప్పుడైన కళకళలాడే దుకాణాలు ఈ ఏడాది బోసిపోయి కనిపించాయి. రేట్లు పెరగడంతో చాలా మంది పసిడి కొనాలంటే ఆలోచిస్తున్నారు. మరోవైపు ఆభరణాలు తయారు చేసే వారు సైతం ఉపాధి లేక ఇబ్బందులు పడుతున్నారు.