అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Rates | మొన్నటి వరకు భారీగా పెరిగిన బంగారం ధరలు (Gold Prices) క్రమంగా తగ్గుతున్నాయి. అక్టోబర్ నెలలో గోల్డ్ రేట్లు (Gold Rates) భారీగా పెరిగిన విషయం తెలిసిందే. అనంతరం ఇటీవల స్వల్పంగా తగ్గాయి. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
నిజామాబాద్ (Nizamabad) మార్కెట్లో గురువారం పది గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 1,28,500గా ఉంది. 22 క్యారెట్ల పసిడి రేటు 1,18,400 వద్ద ట్రేడ్ అవుతోంది. కిలో స్వచ్ఛమైన వెండి 1,74,000 ఉంది. కొద్ది రోజులుగా బంగారం, వెండి ధరలు (Silver Rates) తగ్గుతుండటంతో ప్రజలు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం వివాహాల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు కళకళలాడుతున్నాయి. ధరలు సైతం తగ్గుతుండటంతో గిరాకీ పెరిగిందని దుకాణదారులు చెబుతున్నారు.
