Homeబిజినెస్​GOLD PRICES | బాబోయ్ భ‌గ్గుమంటున్న బంగారం.. తులం ధర ఎంతంటే..

GOLD PRICES | బాబోయ్ భ‌గ్గుమంటున్న బంగారం.. తులం ధర ఎంతంటే..

అక్షరటుడే, హైదరాబాద్​: GOLD PRICES | బంగారం Gold అంటే మహిళలు ఎంత‌ మక్కువ చూపుతారో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు, కానీ ప్రస్తుతం పరిస్థితులు భయపెడుతున్నాయి.

గ్రాము బంగారం కొనాలన్నా భయపడే స్థితి వచ్చింది. రోజురోజుకు బంగారం ధరలు పెరుగుతూ కొత్త రికార్డులు సృష్టిస్తున్నాయి. మన భారతీయ సంప్రదాయంలో బంగారానికి ప్రత్యేక స్థానం ఉంది.

పండుగలు, వివాహాలు, ఇతర శుభకార్యాల సందర్భాల్లో బంగారం కొనుగోలు చేయడం తప్పనిసరి. ఎంత పేద కుటుంబమైనా కొద్దిగా బంగారం అయినా కలిగి ఉండాలని కోరుకుంటుంది.

GOLD PRICES | భ‌య‌పెట్టిస్తున్న బంగారం..

అయితే ఇప్పుడు బంగారం ధరలు GOLD PRICES ఇప్పుడు ఆకాశాన్ని తాకుతున్నాయి. తాజా సమాచారం ప్రకారం సెప్టెంబరు 30న బంగారం ధరలు భారీగా పెరిగాయి.

నిన్నటితో పోల్చుకుంటే తులానికి రూ.930 పెరిగి రూ.1,16,000 పైగా చేరింది. గత రెండు మూడు రోజుల్లో తులానికి రూ.2,000 పైగా పెరిగినట్లు రికార్డులు చెబుతున్నాయి.

ప్రస్తుతం 24 క్యారెట్ల 24 carat 10 గ్రాముల బంగారం ధర రూ. 1,16,410 గా ఉంది. వెండి కూడా అదే దారిలో పరిగెడుతోంది. కిలో వెండి ధర Silver Price రూ. 1,50,000 చేరింది.

హైదరాబాద్‌, చెన్నై, కేరళలో కిలో వెండి రూ.1,60,000 దాటింది. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి అనేది చూస్తే ..

ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,16,560, 22 క్యారెట్ల బంగారం రూ. 1,06,860. ముంబయి, హైదరాబాద్‌, విజయవాడ, బెంగళూరులో 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,16,410 , 22 క్యారెట్ల ధర రూ. 1,06,710.

చెన్నై Chennai లో మాత్రం 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం రూ. 1,16,740 , 22 క్యారెట్ల బంగారం రూ. 1,07,010 కు చేరింది.

బంగారం కొనుగోలు చేసే వారు తప్పనిసరిగా హాల్‌మార్క్‌ hallmark తనిఖీ చేయాలి. హాల్‌మార్క్‌ ద్వారా బంగారం స్వచ్ఛతను నిర్ధారిస్తారు.

24 క్యారెట్‌ బంగారంపై 999, 23 క్యారెట్‌పై 958, 22 క్యారెట్‌పై 916, 21 క్యారెట్‌పై 875, 18 క్యారెట్‌పై 750 అని ముద్రిస్తారు.

సాధారణంగా మార్కెట్‌లో 22 క్యారెట్ల బంగారం ఎక్కువగా అమ్ముడవుతుండగా, కొంత మంది 18 క్యారెట్ ఆభరణాలను Jewellery కూడా ఎంచుకుంటారు.

పెరుగుతున్న ధరలతో సాధారణ ప్రజలు బంగారం కొనుగోలులో వెనుకంజ వేస్తున్నప్పటికీ, పెళ్లిళ్లు, శుభకార్యాల సందర్భంలో మాత్రం బంగారం డిమాండ్ తగ్గకపోవడం గమనార్హం.

Must Read
Related News