అక్షరటుడే, హైదరాబాద్: GOLD PRICES | ఈరోజు, అక్టోబర్ 4వ తేదీ శనివారం, బంగారం ధరలు Gold Price మరోసారి భారీగా పెరిగి పసిడి ప్రేమికులకు షాక్ ఇచ్చాయి.
ముఖ్యంగా 24 క్యారెట్ల (24-carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,520 కి చేరగా, 22 క్యారెట్ల (22-carat gold) 10 గ్రాముల ధర రూ. 1,08,640 నమోదైంది. ఈ ధరలు గత నెలతో పోల్చుకుంటే రికార్డు స్థాయిలో పెరిగాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా అంతర్జాతీయ ఆర్థిక అనిశ్చితి , ముఖ్యంగా అమెరికాలో షట్‌డౌన్ పరిస్థితి వలన పెట్టుబడిదారులు ఈక్విటీ మార్కెట్లకు బదులుగా సురక్షిత పెట్టుబడి మార్గమైన బంగారం వైపు మొగ్గుచూపడమేనని తెలుస్తోంది.
అలాగే డాలరు విలువ పతనం కూడా పసిడి ధరలను ఆకాశానికి ఎగబాకేలా చేసింది. ఈ ట్రెండ్ మరికొంత కాలం కొనసాగే అవకాశం ఉందని నిపుణులు పేర్కొంటున్నారు.
GOLD PRICES | బంగారం కొనుగోలు ఖర్చు భారీగా పెరిగింది
బంగారం ధరల పెరుగుదలతో పసిడి ఆభరణాలు కొనుగోలు చేయాలనుకునేవారికి ఇది గట్టి దెబ్బే అని చెప్పాలి. 10 గ్రాముల బంగారాన్ని కొనాలంటే, బేస్ ధరతో పాటు తరుగు, మేకింగ్ ఛార్జీలు, జీఎస్టీ కలిపితే ఖర్చు మరింత పెరిగిపోతుంది.
ఇది గమనించిన చాలా మంది వినియోగదారులు ఇప్పుడు స్మార్ట్ పెట్టుబడులుగా గోల్డ్ ఈటీఎఫ్ (Gold ETFs) ల వైపు మొగ్గుచూపుతున్నారు. గడిచిన ఏడాది గోల్డ్ ఈటీఎఫ్‌లలో పెట్టుబడి రికార్డు స్థాయిలో పెరిగినట్లు సమాచారం. దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఇలా ఉన్నాయి.
- ఢిల్లీ DELHI లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,18,670 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,08,790 గా ఉంది.
- ముంబయిలో 24 క్యారెట్ల ధర రూ. 1,18,520, 22 క్యారెట్ల ధర రూ. 1,08,640గా ఉంది. హైదరాబాద్‌లో కూడా ఇదే ధరలు కొనసాగుతున్నాయి.
- చెన్నైలో Chennai మాత్రం 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,18,900 కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,08,990గా ఉంది.
- బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,18,520 గా, 22 క్యారెట్ల ధర రూ. 1,08,640 గా ఉంది.
దేశవ్యాప్తంగా బంగారం ధరలు ఇటీవల భారీగా పెరగడం గమనార్హం. అంతర్జాతీయ మార్కెట్‌లో వడ్డీ రేట్లు, డాలర్ మారకం విలువ, మార్కెట్‌లోని అనిశ్చితి వంటి అంశాలు బంగారం ధరలపై ప్రభావం చూపుతున్నాయి.
ఈ నేపథ్యంలో పండుగ సీజన్‌కు ముందు బంగారంలో పెట్టుబడి పెట్టాలా.. లేదా.. అనే విషయంలో వినియోగదారులు తర్జనభర్జన పడుతున్నారు. పసిడితో పాటు వెండి కూడా భారీగా పెరుగుతూ పోతోంది.
ఈ రోజు ఒక కేజీ వెండి ధర రూ. 1,50,862 కి చేరింది. ఇది చరిత్రలో రికార్డుగా భావిస్తున్నారు. వెండి ధర పెరుగుదల వెనుక ప్రధాన కారణంగా ఇండస్ట్రియల్ డిమాండ్ ఉందని నిపుణులు చెబుతున్నారు.
ఎలక్ట్రానిక్స్, రిన్యూవబుల్ ఎనర్జీ వంటి రంగాల్లో వెండికి విపరీతమైన డిమాండ్ ఉండటం వల్ల, రేటు ఇంకా పెరిగే అవకాశం ఉందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.