Homeబిజినెస్​Gold prices down | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

Gold prices down | కాస్త శాంతించిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold prices down : భారతీయ సంప్రదాయాల్లో బంగారానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. చిన్నపాటి వేడుకల నుంచి పెద్దపాటి పెళ్లిళ్ల వరకు బంగారం Gold లేకుండా పూర్తవ్వవు.

పండుగల సమయంలో.. ముఖ్యంగా దసరా, దీపావళి వంటి సందర్భాల్లో బంగారం కొనడం శుభప్రదమని భావిస్తారు. బంధువులకు బంగారం ఇవ్వడం, వారు ఇచ్చిన బంగారాన్ని ఆప్యాయతగా స్వీకరించడం అనేది మన సంస్కృతిలో భాగం.

ఇలాంటి నేపథ్యంలో బంగారానికి సంవత్సరమంతా డిమాండ్ ఉండటం సహజం. అయితే 2025 ప్రారంభం నుంచి బంగారం ధరలు రికార్డు స్థాయిలో పెరుగుతున్నాయి. ప్రస్తుతం బంగారం తులం ధర రూ.1 లక్ష మార్క్ దాటేసింది.

Gold prices down : బంగారం ధరల ట్రెండ్

గత మూడు రోజులుగా బంగారం ధరలు Gold Prices వరుసగా పెరిగి, ఆల్ టైం హైకి చేరాయి. అయితే ఈ రోజు (సెప్టెంబరు 12, శుక్రవారం) ధరలు స్థిరంగా ఉన్నాయి.

22 క్యారెట్ల బంగారం 22 carat gold: 10 గ్రాములకు రూ. 1,01,300 చేరుకోగా, 24 క్యారెట్ల బంగారం 24 carat gold : తులానికి రూ. 1,10,510గా ట్రేడ్ అయింది. గత మూడు రోజుల్లో తులానికి దాదాపు రూ.2,000 వరకు పెరిగినట్లు గమనించవచ్చు.

దేశంలోని ప్రధాన న‌గ‌రాల‌లో కూడా ధ‌ర‌లు దాదాపు ఈ రేంజ్‌లోనే ఉన్నాయి. ప్రపంచ మార్కెట్లో బంగారం ధరలు కొంత స్థిరత చూపిస్తున్నాయి.

స్పాట్ గోల్డ్ రేటు ఔన్సుకు $ 3,644 చేరుకోగా, స్పాట్ సిల్వర్ రేటు: ఔన్సుకు $ 41.71 చేరింది. ఇక రూపాయి మారకం విలువ 1 డాలరుకు రూ. 88.287గా న‌మోదైంది.

హైదరాబాద్ మార్కెట్లో వెండి Silver కూడా ఆల్ టైం హైకి చేరింది. 1 కిలో వెండి రేటు: రూ. 1,40,000కి చేరుకోగా.. ఇతర నగరాల్లో (ముంబయి, ఢిల్లీ) సుమారుగా రూ.1,30,000 వద్ద ట్రేడవుతోంది.

స్థానిక పన్నుల వలన ఈ తేడా ఉంది. ఈ ధరలు 2025 సెప్టెంబరు 12 ఉదయం ఆధారంగా చెప్ప‌బ‌డ్డాయి. మధ్యాహ్నానికి మార్కెట్ పరిస్థితుల ఆధారంగా ధరలు మారవచ్చు.

ట్యాక్స్‌లు కూడా ధరలపై ప్రభావం చూపుతాయి. కనుక కొనుగోలు చేసే ముందు, ప్రాంతీయ మార్కెట్‌ ధరలు చెక్‌ చేయడం మంచిది.