అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gold Rates | సమ్మర్‌లో పెళ్లిళ్లే పెళ్లిళ్లు. ఈ పెళ్లిళ్ల సీజన్‌లో బంగారం(Gold purchase) కొనేందుకు చాలా మంది ఆసక్తి చూపుతుంటారు.
అయితే ఈ మధ్య బంగారం ధరలు పరుగులు పెట్టాయి. ప్రస్తుతం పసిడి పరుగులకు కాస్త కళ్లెం పడినట్టుగా కనిపిస్తుంది. బంగారం, వెండి (Silver) ధరలు ఏ రోజుకారోజు తగ్గినట్టే తగ్గి మళ్లీ అమాంతంగా పెరిగిపోతుండగా.. మే 26న గోల్డ్ రేట్(Gold Price) కాస్త దిగొచ్చింది. భారత మార్కెట్లో 24 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.9,807లుగా ఉంది. అదే విధంగా 22 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.8,989లుగా ఉంది. ఇకపోతే, 18 క్యారెట్ల బంగారం ధర ఒక గ్రాము రూ.7,355లు పలుకుతోంది.
Gold Rates | కాస్త కిందకు..
దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు చూస్తే.. చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,040, 24 క్యారెట్ల ధర రూ.98,220 గా ఉంది. హైదరాబాద్‌లో (Hyderabad) 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 పలుకుతోంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.89,890, 24 క్యారెట్ల రేటు రూ.98,070గా ఉంది.
బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.89,890, 24 క్యారెట్ల ధర రూ.98,070 గా ఉంది.
ఇక భారతదేశ మార్కెట్లో నేటి వెండి ధర గ్రాము రూ.110.80లుగా కాగా, కిలో వెండి (Silver Rate) ధర రూ.1,10,800గా పలుకుతోంది. బంగారం, వెండి ధరలు కాస్త తగ్గాయి. కాబట్టి ఎవరైన కొనాలనే ఇంట్రెస్ట్ ఉన్నవాళ్లు ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే కొనేయడం మంచిది. అంతర్జాతీయ పరిస్థితుల వలన బంగారం, వెండి ధరలలో హెచ్చుతగ్గులు కనిపిస్తూ ఉంటాయి.