అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Price | ప్రస్తుతం భారత్-పాక్(India-Pakistan) మధ్య యుద్ధ వాతావరణం మనం చూస్తూ ఉన్నాం. యుద్ధ ప్రభావం ఇప్పటికైతే సరిహద్దు ప్రాంతాలకు మాత్రమే పరిమితం అయింది. లోపల ఉన్న ప్రజలు కొంచెం టెన్షన్‌లో ఉన్నా.. వివాహాది ఇతర కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. పెళ్లిళ్లలకు ఇతర ఫంక్షన్‌లకు బంగారం Gold కొనాలనుకునే వారికి శుభవార్త అందింది. దేశంలో ఈ రోజు (శనివారం మే10న) 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,834లుగా ఉంది. అది 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.9,014లుగా ఉంది. అటు 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.7,375లుగా పలుకుతోంది. ఇకపోతే, దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో అనేది చూస్తే..
Gold Price | దేశవ్యాప్తంగా ధరలు ఇలా..
ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,290, 24 క్యారెట్ల ధర రూ.98,490 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.90,140, 24 క్యారెట్ల రేటు రూ.98,340 గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది. హైదరాబాద్‌లో Hyderabad 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,760, 24 క్యారెట్ల ధర రూ.99,010 గా ఉంది. విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,140, 24 క్యారెట్ల ధర రూ.98,340 గా ఉంది. ఇంక వెండిధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. పసిడితో పాటే వెండి ధర కూడా దిగొచ్చింది.
గ్రాము రూ. 110.90 ఉండగా, కిలో వెండి Silver ధర రూ.1,10,900లుగా పలుకుతోంది. హైదరాబాద్‌లో కిలో వెండి ధర రూ.1,10,900గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,11,100, ఢిల్లీలో వెండి కిలో ధర రూ.98,900, ముంబైలో రూ.98,900, బెంగళూరులో రూ.98,900, చెన్నైలో రూ.1,10,900 లుగా ఉంది. బంగారంతో సంబంధం లేకుండా వెండి ధరలు ప్రతీ రోజూ తగ్గుతూనే ఉన్నాయి. రోజుకు ఎంత లేదన్నా కేజీపై 10 రూపాయలు తగ్గుతోంది. నిన్న 100 గ్రాముల వెండి ధర 11100 రూపాయల దగ్గర ట్రేడ్ అయింది.