Homeబిజినెస్​gold price rise | ప‌సిడి ధర ప‌రుగులు.. ఈ రోజు ఎంతంటే..!

gold price rise | ప‌సిడి ధర ప‌రుగులు.. ఈ రోజు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: gold price rise | పసిడి ప‌రుగులు Gold Price పెడుతోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో గోల్డ్ ధరలు పెరుగుతుండటంతో దేశీయంగా కూడా బంగారం ధరలు భారీగా పెరిగాయి.

గతంలో ఎన్నడూ లేని స్థాయికి చేరిన పసిడి, ఇప్పుడు రూ.లక్షా 11 వేల మార్క్‌ను దాటింది. వెండి కూడా అదే దారిలో ముందుకు వెళుతూ కిలోకు రూ.1,33,000 మార్క్‌ను తాకింది.

సెప్టెంబర్ 14, 2025, ఆదివారం బంగారం ధరలు 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,11,170 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,900గా న‌మోదైంది.

అదే క్ర‌మంలో వెండి ధ‌ర‌లు 1 గ్రాము: రూ. 133.50, 10 గ్రాములు: రూ. 1,335, 100 గ్రాములు: రూ. 13,350, 1 కిలో: రూ. 1,33,500 గా ట్రేడ్ అయింది.

gold price rise | కొనుగోలుదారులకు సూచనలు

అంతర్జాతీయ మార్కెట్‌ International market లో డాలరు Dollar విలువ, గణాంకాల ప్రకారం మారుతూ ఉంటుంది. ఇటీవల అమెరికా, చైనా మధ్య ఆర్థిక అనిశ్చితి, వడ్డీ రేట్లపై క్లారిటీ లేకపోవడం, ఇన్వెస్టర్ల ఆందోళనలు మొదలైనవన్నీ బంగారం ధరల పెరుగుదలకు దోహదపడుతున్నాయి.

పండుగ సీజన్ కూడా ముడి ధరలపై ప్రభావం చూపుతోంది. ఈ స్థాయిలో ధరలు పెరిగిన నేపథ్యంలో, బంగారం కొనుగోలు చేయాలనుకునే వారు తమ బడ్జెట్‌కి అనుగుణంగా, అవసరమైతే తులం తులంగా కొనే ఆలోచన చేయ‌డం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

అదేవిధంగా వెండి ధరలు కూడా పెరుగుతుండటంతో, ఆభరణాల కంటే పెట్టుబడి దృష్టిలో కొనుగోలు చేసే వారు జాగ్రత్తగా ఉండాలి. ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,170 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,900 గా న‌మోదైంది. ఇక వెండి కిలో ధర రూ. 1,43,000 కి చేరుకుంది.

విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల 10 గ్రా పసిడి ధర రూ. 1,11,170 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,900 గా న‌మోదైంది. ఇక వెండి కిలో ధర రూ. 1,43,000 గా ట్రేడ్ అయింది.

ఢిల్లీలో 24 క్యారెట్ల బంగార ధర రూ. 1,11,300 గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,02,050 గా ట్రేడ్ అయింది. వెండి కిలో ధర రూ.1,33,000 గా కొన‌సాగుతోంది.

ముంబయి Mumbai లో 24 క్యారెట్ల బంగార ధర రూ. 1,11,170 గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ. 1,01,900 గా న‌మోదైంది. వెండి కిలో ధర రూ. 1,33,000 గా ట్రేడ్ అయింది.

చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,11,710 గా న‌మోదు కాగా.. 22 క్యారెట్ల ధర రూ. 1,02,200 గా ట్రేడ్ అయింది. వెండి కిలో ధర రూ. 1,43,000 గా న‌మోదైంది.