Homeబిజినెస్​Gold Price On August 29 | షాకిస్తున్న గోల్డ్.. ఇంకా పెరిగిన ధ‌ర‌.. ఈ...

Gold Price On August 29 | షాకిస్తున్న గోల్డ్.. ఇంకా పెరిగిన ధ‌ర‌.. ఈ రోజు ఎంతంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price On August 29 : ఇటీవల బంగారం, వెండి silver ధరలు పెరుగుతూ పోవడానికి ప్రధాన కారణం అంతర్జాతీయ ఆర్థిక, భద్రతా పరిస్థితులే. అమెరికన్ డాలర్ విలువ క్రమంగా పడిపోతుండటంతో బంగారం ధరలు పెరుగుతున్నాయి.

అంతేకాకుండా, ట్రంప్ Trump ప్రారంభించిన వాణిజ్య యుద్ధాల trade wars ప్రభావం, రష్యా Russia – ఉక్రెయిన్ Ukraine మధ్య కొనసాగుతున్న యుద్ధం వంటి అంశాలు గ్లోబల్ మార్కెట్ల global markets లో అస్థిరతకు దారి తీశాయి.

ఈ పరిస్థితుల్లో పెట్టుబడిదారులు తమ డబ్బును బంగారం, వెండి వంటి సురక్షితమైన ఆసెట్లలో పెట్టేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో పసిడికి భారీగా డిమాండ్ ఏర్పడింది. వెండి కూడా అదే బాటలో ‘నేను సైతం’ అంటూ ధరల్లో ఎగబాకుతోంది.

Gold Price On August 29 : పెరుగుతున్న ధ‌ర‌లు..

ఈ రోజు (ఆగస్టు 29, 2025 – శుక్రవారం) తెలుగు రాష్ట్రాలతో పాటు దేశంలోని ముఖ్య నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం..

హైదరాబాద్ hyderabad లో 10 గ్రాముల (తులం) 22 క్యారెట్ల బంగారం ధర రూ. 10 పెరిగి రూ. 94,060 లుగా న‌మోదైంది. అలానే 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. 10 లు పెరిగి రూ. 1,02,610లకు చేరుకుంది.

ఇవే ధరలు విజయవాడ, విశాఖ పట్నం, పొద్దుటూరు, వరంగల్, నిజామాబాద్ వంటి ప్రధాన నగరాల్లో కూడా ఉన్నాయి.

ఇక దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 10,2760 గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 10 గ్రాములకు రూ. 94,210గా ట్రేడ్ అయింది.

దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో Mumbai 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 1,02,610లుగా న‌మోదు కాగా, 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.94060గా ట్రేడ్ అవుతుంది.

ఇక చెన్నైలో 10 గ్రాముల బంగారం ధర 24 క్యారెట్ల ధర రూ. 1,02,610గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.94,060గా ట్రేడ్ అవుతుంది. ఇవే ధరలు బెంగళూరు, కేరళ, కోల్​కతా, పుణె వంటి ప్రధాన నగరాల్లో కూడా కొనసాగుతున్నాయి.

Must Read
Related News