Homeబిజినెస్​Gold Price on August 26 | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు...

Gold Price on August 26 | స్వ‌ల్పంగా త‌గ్గిన బంగారం ధ‌ర‌లు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold Price on August 26 : గ‌త కొద్ది రోజులుగా బంగారం ధ‌ర‌లు పెరుగుతూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. అయితే గత వారం రోజులుగా బంగారం ధరలు స్థిరంగా ఉండడాన్ని పరిశీలిస్తే.. అంతర్జాతీయ మార్కెట్ల ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది.

అమెరికాలో ప్రస్తుతం ఒక ఔన్స్ బంగారం ధర 3400 డాలర్లకు పైగా ట్రేడవుతోంది. ఇది బంగారం Gold ఆల్ టైం హయ్యెస్ట్ స్థాయికి కొద్దిగా తక్కువగా ఉన్నప్పటికీ, ఇన్వెస్టర్లు బంగారాన్ని భద్రతగా ఎన్నుకోవడం వల్ల ధరల పెరుగుదల కొనసాగుతోంది.

మార్కెట్లలో అనిశ్చితి వాతావరణం నెలకొనడంతో.. ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను బంగారంలోకి మార్చడం ప్రారంభించారు. మ‌రోవైపు అమెరికా డాలరు బలహీనపడడంతో, బంగారానికి డిమాండ్ పెరిగింది. డాలరుకు (Dollar) బదులుగా ఇన్వెస్టర్లు బంగారాన్ని భద్రతా పెట్టుబడిగా భావించి కొనుగోలు చేస్తున్నారు.

Gold Price on August 26 : స్థిరంగా ధ‌ర‌లు..

దేశంలో పండుగల సీజన్ ప్రారంభమవుతున్న నేపథ్యంలో బంగారానికి డిమాండ్ బాగానే పెరుగుతోంది. అలాగే, బంగారు ఆభరణాల తయారీ ఖర్చులు కూడా పెరగడం వల్ల ధరలపై ప్రభావం పడుతోంది.

ప్రస్తుతం ఉన్న ధరల ప్రకారం చూస్తే… 24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,01,500గా ఉంది. 22 క్యారెట్ 10 గ్రాముల బంగారం రేటు రూ. 93,040 గా ట్రేడ్ అయింది (Gold Rate on August 26). అలానే 18 క్యారెట్‌ల పసిడి రేటు రూ. 76130గా న‌మోదైంది.

ఇక వెండి ధరల్లో మాత్రం కొంత‌ పెరుగుదల కనిపించింది. కిలో వెండి silver ధర ప్రస్తుతం రూ. 1,21,000లకు చేరువైంది. మరోవైపు, 10 గ్రాముల ప్లాటినం ధర స్వల్పంగా తగ్గి రూ. 38,110కు చేరుకోవ‌డం విశేషం.

దేశంలోని వివిధ నగారల్లో పసిడి(24కే, 22కే, 18కే) ధరలు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

  • చెన్నై (Chennai) లో రూ. 1,01,500 – రూ. 93,040 – రూ. 76,990
  • ముంబయి (Mumbai) లో రూ. 1,01,500 – రూ. 93,040 – రూ. 76,130
  • ఢిల్లీ (Delhi) లో రూ. 1,01,650 – రూ. 93,190 – రూ. 76,250
  • కోల్‌కతా (Kolkata) లో రూ. 1,01,500 – రూ. 93,040 – రూ. 76,130
  • బెంగళూరు (Bengaluru) లో రూ. 1,01,500 – రూ. 93,040 – రూ. 76,130
  • హైదరాబాద్ (Hyderabad) లో రూ. 1,01,500 – రూ. 93,040 – రూ. 76,130
  • కేరళ (Kerala) లో రూ. 1,01,500 – రూ. 93,040 – రూ. 76,130
  • పుణె (Pune) లో రూ. 1,01,500 – రూ. 93,040 – రూ. 76,130
  • వడోదరా (Vadodara) లో రూ. 1,01,550 – రూ. 93,090 – రూ. 76,170
  • అహ్మదాబాద్​ (Ahmadabad) లో రూ. 1,01,550 – రూ. 93,090 – రూ. 76,170గా న‌మోద‌య్యాయి.

ఇక కిలో వెండి ధరలు చూస్తే..

  • చెన్నైలో రూ. 1,31,100
  • ముంబయిలో రూ. 1,21,100
  • ఢిల్లీలో రూ. 1,21,100
  • కోల్‌కతా లో  రూ. 1,21,100
  • బెంగళూరులో రూ. 1,21,100
  • హైదరాబాద్​లో రూ. 1,31,100
  • కేరళలో రూ. 1,31,100గా ట్రేడ్ అయ్యాయి.