Homeబిజినెస్​gold price drop | తెలుగు రాష్ట్రాల‌లో బంగారం ధ‌ర‌ నేడు ఎంతంటే..!

gold price drop | తెలుగు రాష్ట్రాల‌లో బంగారం ధ‌ర‌ నేడు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: gold price drop | ప‌సిడి ప్రియుల‌కి gold కొన్నాళ్ల నుంచి కంటి మీద నిదుర‌లేకుండాపోయింది. రోజు రోజుకి బంగారం ధ‌ర‌లు పైపైకి పోతూనే ఉన్నాయి.

ల‌క్ష మార్క్ దాటిన బంగారం ధ‌ర‌లు సామాన్యుల‌కి చుక్క‌లు చూపిస్తున్నాయి. ప్రస్తుతం తులం బంగారం కొనాలంటే రూ. లక్షా 10 వేలకుపైనే చెల్లించాల్సిన ప‌రిస్థితి ఉంది.

నిన్న కాస్త త‌గ్గిన బంగారం ధ‌ర సెప్టెంబరు 16న కూడా స్వల్పంగా తగ్గింది. ఇది వినియోగదారులకు అంత‌గా ఊరటనిచ్చే అంశమేమి కాదు. దేశీయంగా తులం బంగారం ధర రూ. 1,11,050గా ట్రేడ్ అయింది. నిన్నటి ధరతో పోల్చుకుంటే బంగారం ధ‌ర‌ స్వల్పంగా రూ.110 తగ్గుముఖం పట్టింది.

24 క్యారెట్ 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,105గా ట్రేడ్ కాగా, ఇదే సమయంలో 22 క్యారెట్ 10 గ్రాముల పసిడి ధర రూ. 1,01,790గా ట్రేడ్ అయింది . ఇక వెండి విష‌యానికి వ‌స్తే కేజీ ధర ఎలాంటి మార్పు లేకుండా రూ. 1,32,900గా ఉంది.

gold price drop | స్థిరంగా ధ‌ర‌లు..

ఢిల్లీలో Delhi 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,200గా ట్రేడ కాగా , 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.1,01,940 గా న‌మోదైంది.

ఇక హైదరాబాద్‌లో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,050గా ట్రేడ్ కాగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,01,790గా న‌మోదైంది.

ముంబయిలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,050గా ట్రేడ్ కాగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,01,790గా న‌మోదైంది.

ఇక చెన్నైలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,370గా న‌మోదు కాగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,02,090గా ట్రేడ్ అయింది.

ఇక బెంగళూరులో Bangalore 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,050గా ట్రేడ్ కాగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,01,790గా న‌మోదైంది.

విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,11,050గా ట్రేడ్ కాగా, అదే 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 1,01,790గా న‌మోదైంది.

ఇక కిలో వెండి ధర రూ.1,32,900గా ట్రేడ్ కాగా, హైదరాబాద్‌, చెన్నై, కేరళ Kerala రాష్ట్రాల్లో ఏకంగా రూ.1,42,900కి చేరుకుంది.

బులియన్‌ మార్కెట్‌ bullion market నిపుణుల ప్రకారం.. బంగారం ధరల పెరగడానికి కారణం ప్రపంచవ్యాప్తంగా ఆర్థిక అనిశ్చితి, డాలరు విలువలో మార్పులని చెబుతున్నారు.