అక్షరటుడే, ఇందూరు: Para swimming | జాతీయ పారా స్విమ్మింగ్ ఛాంపియన్షిప్లో (National Para Swimming Championship) ఇందూరు వాసి శ్రీనికేష్ బంగారు పతకాలు సాధించాడు. ఈనెల 16 నుంచి 18వ తేదీ వరకు హైదరాబాదులోని గచ్చిబౌలి స్టేడియంలో స్విమ్మింగ్ పోటీలు (swimming competitions) జరిగాయని పేర్కొన్నాడు.
బంగారు పతకాలతో పాటు ఉత్తమ స్విమ్మింగ్ క్రీడాకారుడి అవార్డు (best swimmer award) కూడా పొందాడు. 100 మీటర్ల ఫ్రీ స్టైల్, 50మీటర్ల బ్రెస్ట్ స్ట్రోక్, 200 మీటర్ల ఇండివిజువల్ మిడ్లే విభాగాల్లో మూడు బంగారు పతకాలు కైవసం చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పతకాలు సాధించడానికి తనకు శిక్షణనిచ్చిన దినేష్ రాజోరియాకు ధన్యవాదాలు తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని పథకాలు సాధించి పారా ఒలింపిక్స్లో పాల్గొనాలన్నదే తన లక్ష్యమని చెప్పాడు.
