అక్షరటుడే, వెబ్‌డెస్క్ :Bengaluru News | బెంగళూరులో ఆర్సీబీ విక్టరీ పరేడ్ (RCB Victory Parade) సందర్భంగా జరిగిన తొక్కిసలాట(Stampede) చాలా కుటుంబాల్లో తీరని విషాదాన్ని నింపింది.
సీఏలో గోల్డ్ మెడల్(CA Gold Medal) సాధించి.. భర్తతో బంగారు భవిష్యత్‌నూ ఊహించుకున్న ఓ యువతి ఈ ఘటనలో ప్రాణాలు విడిచింది. ఐపీఎల్ సీజన్ ప్రారంభమై 18 ఏళ్ల తర్వాత రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bangalore) కప్ సాధించిన విషయం తెలిసిందే. అయితే తొలిసారి కప్ గెలవడంతో ఆ జట్టుతో పాటు అభిమానులు పెద్ద ఎత్తున సంబరాలు చేసుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన విక్టరీ పరేడ్‌లో జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి చెందారు. అందులో సీఏలో గోల్డ్ మెడల్ సాధించిన యువతి అక్షత ఒకరు.
Bengaluru News |హాఫ్ డే లీవ్ పెట్టి వచ్చి..
ఉత్తర కన్నడ జిల్లాకు చెందిన అక్షత, అక్షయ్ ఏడాదిన్నర క్రితం పెళ్లి చేసుకున్నారు. చార్టెడ్ అకౌంటెన్సీ (CA) పరీక్షల్లో అక్షత గోల్డ్ మెడల్ సాధించింది. కాగా.. కోహ్లీకి వీరాభిమానులు అయిన ఈ దంపతులు విక్టరీ పరేడ్ కోసం హాఫ్ డే లీవ్ పెట్టి మరి వెళ్లారు. కానీ అక్కడ జరిగిన తొక్కిసలాటలో అక్షత చనిపోయింది. దీంతో ఆమె కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు.
బెంగలూరు ఘటనపై దేశవ్యాప్తంగా చర్చ జరుతున్న వేళ అక్కడి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. న్యాయ విచారణకు ఆదేశించింది. ముప్పై రోజుల్లో నివేదిక కోరింది. ఇదే సమయంలో పలువురు పోలీసు ఉన్నతాధికాలపైనా వేటు వేసింది. కాగా.. శుక్రవారం ఉదయం నుంచి పలువురు ప్రముఖుల అరెస్టుల పర్వం కూడా మొదలైంది. కర్నాటక ప్రభుత్వం మున్ముందు తీసుకునే చర్యలపై సర్వత్రా ఆసక్తి నెలకొంది.
