అక్షరటుడే, కామారెడ్డి : Gold Rates | పసిడి ధరలు అందనంత ఎత్తుకు వెళ్తున్నాయి. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.. ప్రపంచంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల (Gold Prices) పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి.
Gold Rates | పెళ్లిళ్ల సీజన్ కావడంతో..
పెళ్లిళ్ల సీజన్ దగ్గర పడుతున్న కొద్దీ పసిడి పరుగులు పెడుతూనే ఉంది. నాలుగు రోజుల క్రితం రూ.1.60 లక్షలు దాటిన బంగారం మంగళవారం రూ.1,66,100 ఉండగా బుధవారం నాటికి ఏకంగా నాలుగు వేలకు పైగా పెరిగి రూ.1,71,500 లకు చేరింది. దాంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. ఒక్కరోజే రూ.4,500 పెరగడంతో రానున్న రోజుల్లో పసిడి ఇంకా ఏ మేరకు వెళ్తుందోనన్న భయం వెంటాడుతోంది. దాంతో రానున్న రోజుల్లో బంగారం కొనే పరిస్తితులు చేయి దాటిపోతుందని చర్చ సాగుతోంది. పెళ్లిళ్ల సీజన్ నాటికి రూ.2 లక్షల వరకు చేరినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని జ్యూవెలరీ షాపుల (Jewelry Shops) నిర్వాహకులు చెప్తున్నారు.
Gold Rates | కామారెడ్డిలో..
కామారెడ్డి (Kamareddy)లో బంగారం ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.. ఇప్పట్లో బంగారం కొనే పరిస్థితుల్లో ఉన్నామా అంటూ చర్చించుకుంటున్నారు. గత పెళ్లిళ్ల సీజన్లో (Wedding Season) రూ.లక్ష వరకు మాత్రమే ఉన్న బంగారం ధర ప్రస్తుతం ఏకంగా రూ.1.71లక్షలకు చేరడంతో బంగారం పేరు వింటేనే బెంబేలెత్తే పరిస్థితి ఏర్పడింది. పట్టణంలో బుధవారం బంగారం ధరలు చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.