అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Rates | బంగారం ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. సామాన్యులు కొనలేని స్థాయికి ఇప్పటికే ధరలు చేరుకున్నాయి. కొన్ని రోజులుగా రాకెట్ వేగంతో పసిడి ధరలు పైపైకి పోతుండటంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
భారతీయులకు బంగారంతో ఉన్న అనుబంధం ఏళ్ల నాటిది. ఏళ్ల నుంచి భారత మహిళలు పసిడి ఆభరణాలు ధరించడానికి ఆసక్తి చూపుతారు. ఈ క్రమంలో ధరలు(Gold Rtaes) పెరగడంతో మహిళలు ఆందోళన చెందుతున్నారు. 24 క్యారెట్ల బంగారం రేట్లు 1.22 లక్షలకు చేరడంతో ఎలా కొనాలని మదన పడుతున్నారు. నిజామాబాద్ మార్కెట్లో మంగళవారం 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,22,500 పలుకుతోంది. 22 క్యారెట్ల పసిడి రేటు రూ.1,13,127 వద్ద ట్రేడ్ అవుతోంది.
Gold Rates | వెండి సైతం అదే బాటలో..
దేశీయంగా వెండి ధరలు(Silver Prices) సైతం వాయువేగంతో దూసుకు పోతున్నాయి. మొన్నటి వరకు కిలోకు రూ.లక్ష వద్ద ఉన్న వెండి ఇటీవల రూ.1.5 లక్షలకు చేరడం గమనార్హం. ప్రస్తుతం నిజామాబాద్ మార్కెట్లో కిలో వెండి రూ.1,54,00 పలుకుతోంది. ఇన్వెస్టర్లు బంగారాన్ని సురక్షిత పెట్టుబడి సాధనంగా భావిస్తున్నారు. దీంతో భారీగా బంగారం కొనుగోలు చేసి పెట్టుకున్నారు. ఈ క్రమంలో రేట్లు పెరుగుతున్నాయి. బంగారం కొనే పరిస్థితి లేకపోవడంతో సామాన్యులు వెండి ధరలు పెరుగుతాయని భావించి ముందుగానే కొనుగోలు చేస్తున్నారు. దీంతో దాని రేట్లు సైతం భారీగా పెరుగుతున్నాయి.
Gold Rates | తల్లిదండ్రుల ఆందోళన
మరికొన్ని రోజుల్లో పెళ్లిళ్ల సీజన్(Wedding Season) ప్రారంభం కానుంది. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లి సమయంలో తల్లిదండ్రులు తమ కూతురికి ఎంతో కొంత బంగారం పెడుతుంటారు. సామాన్యుల నుంచి సంపన్నుల దాకా అందరు తమ స్థోమతను బట్టి కూతురికి బంగారు ఆభరణాలు కానుకగా అందిస్తారు. అయితే ధరలు పెరగడంతో త్వరలో ఆడబిడ్డల పెళ్లిలు ఉన్న వారు ఆందోళన చెందుతున్నారు. అప్పో సొప్పో చేసి బంగారం కొనాలనుకున్నా.. రేట్లను చూసి ఆలోచిస్తున్నారు. నిత్యం ధరలు పెరుగుతుండటంతో తగ్గుతాయేమోనని ఆశగా చూస్తున్నారు. అయితే పసిడి ధరలు(Gold Prices) మాత్రం తగ్గేదే లే అంటూ దూసుకు పోతున్నాయి.