అక్షరటుడే, కామారెడ్డి: Gold Rates | పసిడి పరుగులు తీస్తోంది.. ఆకాశమే హద్దుగా పెరుగుతున్న బంగారం ధరల పెరుగుదల ఇప్పట్లో ఆగేలా కనిపించట్లేదు.. ప్రపంచంలో పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు బంగారం ధరల పెరుగుదలకు కారణంగా నిలుస్తున్నాయి.
Gold Rates | కామారెడ్డిలో..
కామారెడ్డిలో (Kamareddy) బంగారం ధరలు చూసి ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు.. ఇప్పట్లో బంగారం కొనే పరిస్థితుల్లో ఉన్నామా అంటూ చర్చించుకుంటున్నారు. గత పెళ్లిళ్ల సీజన్లో (wedding season) రూ.లక్ష వరకు మాత్రమే ఉన్న బంగారం ధర ప్రస్తుతం వేగంగా పెరుగుతోంది. పట్టణంలో శుక్రవారం బంగారం ధరలు చూసి ప్రజలు నోరెళ్లబెడుతున్నారు.
ఈరోజు మధ్యాహ్నం కామారెడ్డి పట్టణంలో తులం బంగారం ధర అక్షరాల రూ. 1,10,200 పలుకుతోంది. ఈ ధరలు చూసి బంగారం వ్యాపారులే అవాక్యయ్యారు. ఇలా ధరలు పెరుగుతూపోతే సామాన్య ప్రజలు బంగారం పేరు చెబితేనే భయపడే పరిస్థితి వస్తుందని వారు పేర్కొన్నారు. ఈ ధర మరింత పెరిగే అవకాశం ఉంది తప్ప తగ్గే ఛాన్స్ లేదని జ్యూవెల్లరీ షాపుల (Jewelry shop) నిర్వాహకులు చెబుతున్నారు.