అక్షరటుడే, వెబ్డెస్క్ : Gold Card Visa | అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ (US President Donald Trump) గోల్డ్ కార్డు వీసాల పంపిణీని ప్రారంభించారు. అగ్రరాజ్యం పౌరసత్వం పొందాలనుకునే సంపన్నుల కోసం దీనిని ప్రవేశ పెట్టిన విషయం తెలిసిందే. వైట్ హౌస్ (White House)లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో తాజాగా వాటిని ప్రారంభించారు.
అమెరికా అధ్యక్షుడిగా రెండో సారి బాధ్యతలు చేపట్టిన ట్రంప్ వలసదారులపై కఠిన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అక్రమ వలసదారులను పంపించడంతో పాటు వీసా జారి నిబంధలను కఠినతరం చేశారు. హెచ్–1బీ వీసా దరఖాస్తు రుసుమును కూడా భారీగా పెంచారు. అయితే దేశంలో భారీగా పెట్టుబడులు పెట్టే వారికి గోల్డ్ కార్డు వీసా జారీ చేస్తామని గతంలో ఆయన ప్రకటించారు.
Gold Card Visa | ఎంత కట్టాలంటే..
భారీ మొత్తం చెల్లించడానికి సిద్ధంగా ఉన్న వ్యక్తులు, కంపెనీలకు చట్టపరమైన హోదాను, అమెరికా పౌరసత్వాన్ని మంజూరు చేయడానికి రూపొందించబడిన అధిక ధరల ఇమ్మిగ్రేషన్ ఆఫర్ గోల్డ్ కార్డు వీసా. మూడు దశాబ్దాల నాటి EB-5 పెట్టుబడిదారుల వీసాకు ప్రత్యామ్నాయంగా దీనిని రూపొందించారు. ఈ వీసా కోసం వ్యక్తిగతంగా 1 మిలియన్ డాలర్లు లేదా, వారి యజమానుల ద్వారా 2 మిలియన్ డాలర్ల పెట్టుబడి పెట్టాలి.
Gold Card Visa | ‘గోల్డ్ కార్డ్’ ఉపయోగాలు
ఈ వీసాతో ఫాస్ట్రాక్ లీగల్ రెసిడెన్సీ (Fastrack Legal Residency), యూఎస్ పౌరసత్వం లభిస్తుంది. కార్డు హోల్డర్లు శాశ్వత చట్టపరమైన నివాసాన్ని పొందుతారు. వారు యునైటెడ్ స్టేట్స్లో నిరవధికంగా నివసించవచ్చు, పని చేయవచ్చు మరియు కాలక్రమేణా, యుఎస్ పౌరసత్వాన్ని పొందవచ్చు. ఉద్యోగ సృష్టి అవసరాలపై ఆధారపడిన EB-5 ప్రోగ్రామ్ లాగా కాకుండా, కొత్త కార్డ్ ప్రమాణాలు క్రమబద్ధీకరించబడినట్లు కనిపిస్తాయి. దీంతో అమెరికా (America) ఖజానాకు భారీగా ఆదాయం వస్తుందని ట్రంప్ పేర్కొన్నారు. గోల్డ్ కార్డ్ ప్రోగ్రామ్ కింద దరఖాస్తుదారుడు EB-1, EB-2 వీసా కింద చట్టబద్ధమైన శాశ్వత నివాసి హోదాను పొందుతారు. ఆన్లైన్ ఈ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటేంది. ఈ మేరకు ట్రంప్ వెబ్సైట్ను సైతం ప్రారంభించారు.