Homeబిజినెస్​Today Gold Price | కాస్త తగ్గిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు రేటు ఎంతంటే..!

Today Gold Price | కాస్త తగ్గిన బంగారం ధ‌ర‌.. ఈ రోజు రేటు ఎంతంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price: బంగారం Gold ధ‌ర‌లు రోజు రోజుకు పెరుగుతూ ఉన్నాయి. దీంతో సామాన్యులు కొనే పరిస్థితి లేదు. భౌగోళికంగా నెల‌కొన్న ఉద్రిక్త ప‌రిస్థితుల వ‌ల్ల‌నే బంగారం, వెండి ధ‌ర‌ల‌లో మార్పులు చోటు చేసుకుంటున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప తగ్గుదల నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు ఉదయం 10 గ్రాముల 24 క్యారెట్​ల బంగారం ధర రూ. 1,00,470కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ. 92, 090కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర ఈ రోజు దాదాపు రూ.600 వరకు తగ్గింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ.1,00,620కి చేరుకోగా, 22 క్యారెట్​ల గోల్డ్(22-carat gold) ధర 10 గ్రాములకు రూ. 92,240 కి చేరుకుంది.

Today Gold Price : కాస్త త‌గ్గాయి..

ఇక హైదరాబాద్‌, విజయవాడలో (Vijaywada) 24 క్యారెట్​ల (24 carat gold) 10 గ్రాముల బంగారం ధర రూ.1,00,470కి చేరుకోగా, 22 క్యారెట్​ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.92,090కి చేరింది. వెండి ధరలు కేజీకి రూ. 100 మేర తగ్గాయి. ఈ క్రమంలో దేశంలోని ఇత‌ర‌ ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) ప‌రంగా చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 1,00,470, రూ. 92,090, విజయవాడలో రూ. 1,00,470, రూ. 92,240, ఢిల్లీలో రూ. 1,00,620, రూ. 92,660, ముంబైలో రూ. 1,00,470 , రూ. 92,090, వ‌డోదరలో రూ. 1,00,520 , రూ. 92,140 , కోల్‌కతాలో రూ. 1,00,470 , రూ. 92,090 , చెన్నైలో రూ. 1,00,470, రూ. 92,090, బెంగళూరులో రూ. 1,00,470, రూ. 92,090 , కేరళలో రూ. 1,00,470, రూ. 92,090, పుణెలో రూ. 1,00,470, రూ. 92,090గా ఉన్నాయి.

ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు కేజీ ప‌రంగా చూస్తే.. హైదరాబాద్‌లో (Hyderabad) రూ. 1,19,900, విజయవాడలో రూ. 1,19,900, ఢిల్లీలో రూ. 1,09,900, చెన్నైలో రూ. 1,19,900, కోల్‌కతాలో రూ. 1,19,900, కేరళలో రూ. 1,19,900, ముంబైలో రూ. 1,09,900, బెంగళూరులో రూ. 1,09,900, వడోదరలో రూ. 1,09,900, అహ్మదాబాద్‌లో రూ. 1,09,900గా ఉన్నాయి. ఇలా బంగారం, వెండి ధ‌ర‌లు పెరుగుతూ పోతే కొనేదెలా అంటూ సామాన్యులు వాపోతున్నారు.