ePaper
More
    Homeబిజినెస్​Today Gold Price | స్వ‌ల్పంగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..!

    Today Gold Price | స్వ‌ల్పంగా దిగొచ్చిన బంగారం ధ‌ర‌.. వెండి ప‌రిస్థితి ఏమిటంటే..!

    Published on

    అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today Gold Price : అంతర్జాతీయ మార్కెట్లో బంగారం (Gold rates) ధరలు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో, దేశీయంగా కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు చోటుచేసుకున్నాయి. పన్నులు, ఎక్సైజ్ సుంకం లాంటి కారణాల వల్ల బంగారం, వెండి ధరలు ప్రతి రోజు మారుతున్నాయి. ఒక్కో రోజు ధరలు తగ్గితే, మరుసటి రోజు పెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. భారతీయుల సాంప్రదాయంలో బంగారానికి ఉన్న ప్రాధాన్యత విశేషం.

    ముఖ్యంగా మహిళలకు బంగారం అంటే ప్రత్యేకమైన భావన ఉంటుంది. అయితే ఈ మ‌ధ్య కాలంలో బంగారం ధ‌ర‌లు పెరుగుతుండ‌డం సామాన్యుల‌ను క‌ల‌వ‌రపెడుతోంది. గతవారం లక్ష రూపాయలు దాటేసిన బంగారం ఇప్పుడు రూ. 98 వేలకు దిగి రావ‌డం కొంత ఊర‌ట అనే చెప్పాలి.

    Today Gold Price : కాస్త త‌గ్గుద‌ల‌..

    ప్ర‌ధాన‌ నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) చూస్తే.. చెన్నైలో 24 క్యారెట్లు (24 carats) – రూ.98,820, 22 క్యారెట్లు – రూ.90,590, ముంబయి(Mumbai)లో 24 క్యారెట్లు – రూ.98,820 కాగా, 22 క్యారెట్లు – రూ. 90,590, ఢిల్లీ(Delhi)లో 24 క్యారెట్లు – రూ. 98,970గా, 22 క్యారెట్లు – రూ. 90,740 ఉన్నాయి. ఇక హైదరాబాద్‌ (Hyderabad)లో 24 క్యారెట్లు – రూ.98,820 కాగా, 22 క్యారెట్లు – రూ.90,590, బెంగళూరులో (Bangalore) 24 క్యారెట్లు – రూ.98,820, 22 క్యారెట్లు – రూ.90,590, విజయవాడలో 24 క్యారెట్లు – రూ.98,820, 22 క్యారెట్లు (22 carats) – రూ.90,590గా పలుకుతున్నాయి, కోల్‌కతాలో 24 క్యారెట్లు – రూ.98,820, 22 క్యారెట్లు – రూ.90,590గా ఉన్నాయి. ఇక ప్ర‌ధాన న‌గ‌రాల‌లో వెండి ధ‌ర‌లు కేజీకి చూస్తే.. హైదరాబాద్‌లో రూ. 1,19,900గా ఉంది.

    ఇక విజయవాడలో కేజీ వెండి ధ‌ర‌ రూ. 1,19,900గా ఉండ‌గా, ఢిల్లీలో రూ. 1,09,900, చెన్నైలో రూ. 1,19,900, కోల్‌కతాలో రూ. 1,19,900, ముంబయిలో రూ. 1,09,900, కేరళలో రూ. 1,19,900, బెంగళూరులో రూ. 1,09,900, అహ్మదాబాద్‌లో రూ. 1,09,900, వడోదరలో రూ. 1, 09, 900గా ట్రేడ్ అయింది. బంగారంతో పాటు వెండి కూడా తక్కువ శాతం మేర తగ్గింది. వాణిజ్య నిపుణుల అంచనాల ప్రకారం, రాబోయే రోజుల్లో అంతర్జాతీయ మార్కెట్ ఒత్తిళ్లు, డాలర్ Dollar విలువలో మార్పులు, ఆర్థిక స్థిరత వంటి అంశాలపై ఆధారపడి ధరల్లో మరిన్ని మార్పులు వచ్చే అవకాశముంది. కొనుగోలుదారులు దీన్ని దృష్టిలో పెట్టుకొని పెట్టుబడులు చేసే ముందు ధరల ఒడుదుడుకులను గమనించడం మంచిది.

    Read all the Latest News on Aksharatoday.in

    More like this

    Kaloji Jayanthi | పోలీస్ శాఖ ఆధ్వర్యంలో కాళోజీ జయంతి వేడుకలు

    అక్షరటుడే నిజామాబాద్ సిటీ: Kaloji Jayanthi | నిజామాబాద్ కమిషనరేట్ పరిధిలో కాళోజీ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు....

    Formula E Race Case | ఫార్మూలా ఈ రేసులో భారీగా అవినీతి.. ఏసీబీ సంచలన నివేదిక

    అక్షరటుడే, వెబ్​డెస్క్ : Formula E Race Case | రాష్ట్రంలో స్థానిక ఎన్నికల (Local Body Elections)...

    Nizamabad City | జెండాగల్లిలో పేకాట..

    అక్షర టుడే, వెబ్ డెస్క్: Nizamabad City | నగరంలోని జెండాగల్లిలో పేకాట స్థావరంపై నాలుగో టౌన్ పోలీసులు...