అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Rates | ఆగస్టు మొదటి వారంలో భారీగా పెరిగిన బంగారం Gold ధరలు ఇప్పుడు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. ఇది మహిళలకు కాస్త ఉపశమనం కలిగిస్తోంది.
భౌగోళిక రాజకీయ అనిశ్చితుల వలన పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపడంతో ఇటీవల బంగారం ధరలు ఆల్‌టైమ్ గరిష్టానికి వెళ్లింది. అయితే ఇప్పుడు కాస్త తగ్గుతూ ఉండటం శుభపరిణామం అని చెప్పాలి.
ఆగస్టు 16న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,01,230గా నమోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. రూ.92,790కి చేరింది. అయితే నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర Gold Price వంద రూపాయల మేర తగ్గిందని అర్ధమవుతోంది.
Gold Rates : తగ్గుతున్న ధరలు..
దేశంలోని ప్రధాన నగరాలలో బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
- హైదరాబాద్‌లో 24 క్యారెట్ల పసిడి 10 గ్రాముల ధర రూ.1,01,230గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ.92,790గా ట్రేడ్ అయింది. ఇక కిలో వెండి ధర రూ.1,26,200 గా నమోదైంది.
- విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల గోల్డ్ ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.92,790 లుగా నమోదైంది. వెండి కిలో ధర రూ.1,26,200గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,380గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.92,940 లుగానమోదైంది. ఇక ఇక్కడ కిలో వెండి ధర Silver Price రూ.1,16,200 గా ఉంది.
- ముంబైలో Mumbai 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల ధర రూ.93,790గా నమోదైంది. అలానే వెండి ధర కిలో రూ.1,16,200గా ఉంది.
- చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా.. 22 క్యారెట్ల ధర రూ.92,790 గా నమోదైంది. ఇక వెండి ధర కిలో రూ.1,26,200గా ట్రేడ్ అయింది.
- బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,01,230గా ట్రేడ్ కాగా , 22 క్యారెట్ల ధర రూ.92,790 గా నమోదైంది. వెండి ధర కిలో రూ.1,16,200గా ఉంది.
వెండి కిలో ధర నిన్నటి కంటే రూ.100 పెరిగింది. ఇక ప్రాంతాల వారిగా బంగారం, వెండి ధరల్లో వ్యత్యాసం ఉంటుంది అన్న విషయాన్ని గమనించాలి.