Homeబిజినెస్​Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

Today gold Price | నేడు బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Today gold Price : ఇజ్రాయెల్-ఇరాన్ వివాదం, డాలర్ ఇండెక్స్ బలహీనత, ప్రపంచ ఈక్విటీ మార్కెట్లలో విస్తృత అమ్మకాల మధ్య బంగారం సుర‌క్షిత‌మైన పెట్టుబ‌డి ఎంపిక‌గా మారింది. ముడి చమురు ధరలు పెరగడంతో లోహాల పెరుగుదలకు కూడా కారణమైంది. రూపాయి బలహీనత కారణంగా బంగారం, వెండి రెండింటి ధరలు పెరుగుతున్నాయి.

ప్రపంచ అస్థిరత ఇంకా కొనసాగుతున్నందున కేంద్ర బ్యాంకు విధానాలు డేటాపై ఆధారపడి ఉండటంతో బంగారం, వెండి ధరలు సమీప భవిష్యత్తులో అస్థిరంగా ఉండే అవకాశం ఉంది. రోజురోజుకు పసిడి ధరలు పెరుగుతూ సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కాగా, నేడు మంగళవారం మార్కెట్‌లో బంగారం Gold prices today ధరలు ఎలా ఉన్నాయో చూస్తే..

Today gold Price : కాస్త త‌గ్గుద‌ల‌..

నేడు బంగారం ప్రియులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే పసిడి ధర కాస్త తగ్గింది. జూన్ 17, 2025న 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,01,500 ఉండగా, 22 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ.93,040గా ఉంది. జూన్ 16, 2025 సోమవారం (నిన్న) 24 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర రూ.101,510గా ఉండగా, నేడు రూ.10 తగ్గి.. రూ.101,500కు చేరింది. అలాగే 22 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.93,050గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో రూ.93,040కు చేరుకుంది. 22 క్యారెట్​ల 10 గ్రాముల బంగారం ధర నిన్న రూ.93,050గా ఉండగా, నేడు రూ.10 తగ్గడంతో గోల్డ్ రేట్ రూ.93,040గా ఉంది.

ప్రముఖ నగరాల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే.. హైదరాబాద్‌లో gold rate hyderabad 24 క్యారెట్​ల బంగారం ధర రూ.101,500 ఉండగా.. 22 క్యారెట్​ల ధర రూ.93,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,19,800గా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్​ల పసిడి ధర రూ.101,500 ఉంటే.. 22 క్యారెట్​ల ధర రూ.93,050గా ఉంది. కిలో వెండి ధర రూ.1,19,800గా ఉంది. వరంగల్ లో 24 క్యారెట్​ల పసిడి ధర రూ.101,500, 22 క్యారెట్​ల ధర రూ.93,050గా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,19,800గా ఉంది.

Must Read
Related News