Gold price on August 19 | స్వ‌ల్పంగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌.. తులం బంగారం ల‌క్ష‌కి పైనే
Gold price on August 19 | స్వ‌ల్పంగా త‌గ్గిన ప‌సిడి ధ‌ర‌.. తులం బంగారం ల‌క్ష‌కి పైనే

అక్షరటుడే, వెబ్ డెస్క్: Today gold price | గ‌త కొద్ది రోజులుగా ప‌రుగులు పెట్టిన ప‌సిడి Gold ఇప్పుడు కాస్త శాంతిస్తుంది. మొన్నటికి మొన్న తులం బంగారం ల‌క్ష దాటేయడంతో అంద‌రి గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తాయి.. అయితే చూస్తుండ‌గానే బంగారం ధ‌ర‌లు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి.

ఏప్రిల్‌ 22న లక్ష మార్కు దాటేసిన బంగారం ఆ త‌ర్వాత స్వ‌ల్పంగా త‌గ్గుతూ వ‌చ్చింది. ఓవరాల్‌గా ఈ 10 రోజుల్లోనే 10 గ్రాములకి దాదాపు 5 వేల వరకు రేటు తగ్గింది. వాస్తవానికి అంతర్జాతీయ పరిణామాల ప్రకారం.. బంగారం, వెండి ధరల్లో ఎప్పటికప్పుడు మార్పులు జరుగుతూ ఉండ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాం. ఒక‌సారి పెరిగితే ఒక‌సారి త‌గ్గుతూ ఉంటుంది. అయితే మే 4న ఆదివారం ఆరు గంట‌ల వ‌ర‌కు న‌మోదైన ధ‌ర‌లు చూస్తే స్వచ్ఛమైన 24 క్యారెట్ల పసిడి ధర రూ.95,510గా ఉంది.

Today gold price | త‌గ్గిన ధ‌ర‌లు..

22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.87,550గా ఉంది. వెండి కిలో ధర రూ.98,000లుగా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,550, 24 క్యారెట్ల ధర రూ.95,510 గా ఉంది. విశాఖపట్నం, విజయవాడ Vijayawada నగరాల్లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.87,550, 24 క్యారెట్ల ధర రూ.95,510గా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.87,700, 24 క్యారెట్ల ధర రూ.95,660 గా ఉంది.ముంబైలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్ల ధర రూ.95,510గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్ల రేటు రూ.95,510గా ఉంది. 22 క్యారెట్ల ధర రూ.87,550, 24 క్యారెట్ల ధర రూ.95,510గా ఉంది.

వెండి ధరలు silver prices చూస్తే.. హైదరాబాద్‌‌లో Hyderabad కిలో వెండి ధర రూ.1,09,900 కాగా, విజయవాడ, విశాఖపట్నంలో రూ.1,09,000, ఢిల్లీలో వెండి కిలో ధర రూ.98,000గా ఉంది. ముంబైలో రూ.98,000, బెంగళూరులో రూ.98,000, చెన్నైలో రూ.1,09,000 లుగా ఉంది. ఇప్పుడిప్పుడే బంగారం, వెండి ధ‌ర‌లు కాస్త శాంతిస్తున్నాయి కాబ‌ట్టి ఎవ‌రైన కొనాల‌ని అనుకున్న వారు ఏ మాత్రం ఆల‌స్యం చేయ‌కుండా బంగారం లేదా వెండి కొనేయండి.