Homeబిజినెస్​Today gold price | ప‌సిడి ప్రియుల‌కు అల‌ర్ట్.. ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు...

Today gold price | ప‌సిడి ప్రియుల‌కు అల‌ర్ట్.. ఈ రోజు బంగారం, వెండి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | బంగారం ధ‌ర‌లు(Gold price) ఈ మ‌ధ్య స్థిరంగా ఉండ‌డం లేదు. ఒక‌సారి పెరుగుతూ త‌గ్గుతూ వ‌స్తున్నాయి. బంగారం, వెండి ధరలు ఆల్‌టైమ్ గరిష్టంలో ట్రేడ్ అవుతున్నాయి. అంతర్జాతీయంగా ఈక్విటీ మార్కెట్లపై(Equity markets) ఒత్తిడి, ముడిచమురు ధరలు(Crude oil price) పెరగడం వంటి అంశాలు పసిడి ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలుస్తున్నాయి. అటు వెండి ధరలు కూడా గరిష్ట స్థాయిల్లోనే స్థిరంగా కొనసాగుతున్నాయి. నిన్నటితో పోల్చుకుంటే ఈ రోజు బంగారం ధరల్లో స్వల్ప పెరుగుదల నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (జూన్ 22న) ఉదయం 6.30 గంటల సమయానికి 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర రూ. రూ. 1,00,750కి చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.92,350కి చేరింది. నిన్నటితో పోల్చుకుంటే బంగారం ధర ఈ రోజు దాదాపు రూ.300 వరకు పెరిగింది.

Today gold price | ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..

వాస్తవానికి పసిడి, వెండికి ఎల్లప్పుడూ డిమాండే ఉంటుంది. బులియన్ మార్కెట్‌లో బంగారం, వెండి Silver ధరలు ఒక్కోసారి తగ్గితే.. మరికొన్ని సార్లు పెరుగుతూ వస్తుంటాయి.. తాజాగా.. బంగారం, వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. ఆదివారం నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 24 క్యారెట్ల బంగారం పది గ్రాముల ధర రూ.1,00,750 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,350లుగా ఉంది. వెండి కిలో ధర రూ.1,10,000లుగా ఉంది. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల బంగారం ధర రూ.1,00,750 ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,350లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,20,000లుగా ఉంది. విజయవాడ, విశాఖపట్నంలో 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,750 ఉంటే.. 22 క్యారెట్ల ధర రూ.92,350లుగా ఉంది. కిలో వెండి ధర రూ.1,20,000లుగా ఉంది.

ఢిల్లీలో (Delhi) 24 క్యారెట్ల పసిడి ధర రూ.1,00,900, 22 క్యారెట్ల ధర రూ.92,500లుగా ఉంది. మరోవైపు కిలో వెండి ధర రూ.1,10,000లుగా ఉంది. ముంబైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,750, 22 క్యారెట్ల ధర రూ.92,350గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000లుగా ఉంది. చెన్నైలో 24 క్యారెట్ల ధర రూ.1,00,750 లు ఉండగా.. 22 క్యారెట్ల ధర రూ.92,350 లుగా ఉంది. వెండి ధర కిలో రూ.1,20,000 లుగా ఉంది. బెంగళూరులో 24 క్యారెట్ల ధర రూ.1,00,750, 22 క్యారెట్ల ధర రూ.92,350గా ఉంది. వెండి ధర కిలో రూ.1,10,000లుగా ఉంది.