Homeబిజినెస్​Today gold price | బంగారం కొనాలనుకుంటున్నారా.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

Today gold price | బంగారం కొనాలనుకుంటున్నారా.. నేటి ధ‌ర‌లు ఎలా ఉన్నాయంటే..!

- Advertisement -

అక్షరటుడే, వెబ్​డెస్క్​: Today gold price | భార‌తీయుల‌కి బంగారం Gold ornaments అంటే ఎంత మ‌క్కువ అనేది ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. కొత్త కొత్త డిజైన్లలో ఉండే బంగారు ఆభరణాలు ధరించాలని మ‌హిళ‌లు ఎంత‌గానో ఆరాటపడుతుంటారు.

పండగలు, శుభకార్యాల్లో బంగారం ఉండాల్సిందే. అయితే ఒక దశలో తులం బంగారం రేటు లక్ష రూపాయల మార్క్ దాటింది. ఆ తర్వాత అమెరికా- బ్రిటన్ ట్రేడ్ డీల్, చైనాపై అమెరికా సుంకాలు తగ్గింపు వంటి, ఫెడ్ వడ్డీ రేట్ల ప్రకటన వంటి అంశాలతో బంగారం ధరలు భారీగా దిగివచ్చాయి. క్రితం రోజున భారీగా తగ్గిన పసిడి ధరలు నేడు (మే 11) కాస్త పెరిగాయి. మరోసారి తగ్గుతుందని ఆశించిన కొనుగోలుదారులకు నేడు నిరాశే ఎదురైంది. భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.9,868లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ.9,045లు పలుకుతోంది.

Today gold price | పెరిగిన బంగారం ధ‌ర‌..

అదేవిధంగా 18 క్యారెట్ల బంగారం ధర గ్రాము రూ. 7,401.లుగా ఉంది. ఢిల్లీలో 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి ధర రూ.90,600. 24 క్యారెట్ల ధర రూ.98,830గా ఉంది. ముంబైలో Mumbai 22 క్యారెట్ల ధర రూ.90,450. 24 క్యారెట్ల ధర రూ.98,680గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల రేటు రూ.98,680గా ఉంది. బెంగళూరులో 22 క్యారెట్ల ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680గా ఉంది. హైదరాబాద్‌లో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450. 24 క్యారెట్ల ధర రూ.98,640గా ఉంది. విశాఖపట్నంలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది.

విజయవాడలో 22 క్యారెట్ల బంగారం ధర రూ.90,450, 24 క్యారెట్ల ధర రూ.98,680 గా ఉంది. ఇక కిలో వెండి ధర రూ.1,11,000లుగా పలుకుతోంది. ఓవైపు బంగారం ధరలు ఒడుదొడుకులకు లోనవుతుంటే వెండి రేటు మాత్రం స్థిరంగానే ఉంది. పసిడి ధరలు ఓసారి పెరుగుతూ, ఓసారి తగ్గుతున్నా వెండి Silver ధరల్లో మార్పు లేదు. గత నాలుగు రోజులుగా స్థిరంగానే కొనసాగుతోంది.