Homeబిజినెస్​Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

Gold And Silver | కాస్త శాంతించిన బంగారం ధర..

- Advertisement -

అక్షరటుడే, వెబ్‌డెస్క్‌: Gold And Silver : నిన్న‌టి వ‌ర‌కు కూడా దేశీయంగా బంగారం ధ‌ర‌లు ఆల్‌టైమ్ గరిష్టానికి చేరి సామాన్యుల‌కి కంటిపై నిద్ర లేకుండా చేశాయి.

భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు ఎక్కువ ఆస‌క్తి చూపించారు. ఈ క్రమంలోనే బంగారం ధ‌ర‌లు(Gold prices) భారీగా పెరిగాయి.

డాలర్‌తో పోల్చుకుంటే రూపాయి క్షీణిస్తుండటం కూడా బంగారం పెరుగుదలకు ప్ర‌ధాన కార‌ణ‌మ‌ని చెప్పాలి. పండుగ‌లు, పెళ్లిళ్ల స‌మ‌యంలో బంగారం ధ‌ర‌లు పెరగడం పరిపాటిగా మారింది.

ఈ రోజు (సెప్టెంబరు 9న) 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర 1,08,370గా న‌మోదు కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.99, 350గా ట్రేడ్ అయింది.

Gold And Silver : స్వ‌ల్ప త‌గ్గుద‌ల‌..

దేశంలోని ప్ర‌ధాన నగ‌రాల‌లో బంగారం, వెండి రేట్లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,08,520గా న‌మోదు కాగా , 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ.99,490గా న‌మోదైంది.

ఇక హైదరాబాద్‌, విజయవాడలో Vijaywada 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.1,08,370గా ట్రేడ్ అవుతుండ‌గా , 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.99,350గా న‌మోదు అయ్యాయి.

ముంబయిలో రూ.1,08,370, రూ.99,350 గా న‌మోదు అయ్యాయి. ఇక వడోదరలో రూ.1,08,400, రూ.99,390గా ట్రేడ్ కాగా, కోల్‌కతాలో రూ.1,08,370, రూ.99,350గా న‌మోదు అయ్యాయి.

చెన్నైలో రూ.1,08,370, రూ.99,350గా న‌మోదు కాగా, బెంగళూరులో రూ.1,08,370, రూ.99,350, కేరళలో రూ.1,08,370, రూ.99,350, పుణెలో రూ. 1,08,370, రూ.99,350 గా ట్రేడ్ అయింది.

ఇక వెండి ధరలు Silver Prices నిన్నటితో పోల్చుకుంటే కేజీకి వంద రూపాయల మేర తగ్గ‌డం కాస్త ఉపశమనంగా పేర్కొనవచ్చు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న వెండి రేట్లు ఎలా ఉన్నాయ‌నేది చూస్తే..

హైదరాబాద్‌లో రూ.1,36,900గా న‌మోదు కాగా, విజయవాడలో రూ.1,36,900, ఢిల్లీలో రూ.1,26,900, చెన్నైలో రూ.1,36,900, కోల్‌కతాలో రూ.1,26,900, కేరళలో రూ.1,26,900, ముంబయిలో రూ.1,26,900, బెంగళూరులో రూ.1,26,900, వడోదరలో రూ.1 26,900, అహ్మదాబాద్‌లో రూ.1,26,900 గా ట్రేడ్ అయింది.