Homeబిజినెస్​Gold and Silver Rates | స్థిరంగా పసిడి ధ‌ర‌.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల‌లో...

Gold and Silver Rates | స్థిరంగా పసిడి ధ‌ర‌.. ఈ రోజు తెలుగు రాష్ట్రాల‌లో బంగారం, వెండి రేట్స్ ఎలా ఉన్నాయంటే..!

అక్షరటుడే, హైదరాబాద్​: Gold and Silver Rates | బంగారం ధర Gold Price రోజురోజుకీ పెరుగుతూ సరికొత్త రికార్డులను సృష్టిస్తోంది. భౌగోళిక రాజకీయ అనిశ్చితుల నేపథ్యంలో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తుల వైపు మొగ్గు చూపుతుండటంతో బంగారానికి డిమాండ్ భారీగా పెరుగుతోంది.

అంతర్జాతీయ మార్కెట్లలో కొనసాగుతున్న అనిశ్చితి పరిస్థితులు, డాలరుతో పోల్చితే.. రూపాయి విలువ క్షీణిస్తుండటం కూడా బంగారం ధరల పెరుగుదలకు ప్రధాన కారణంగా నిలిచాయి.

ఈ నేపథ్యంలో సెప్టెంబరు 28న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,15,480 కి చేరింది. అదే సమయంలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,05,850 గా ఉంది.

దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల బంగారం ధర (24 carat gold price) రూ. 1,15,630 గా నమోదైంది. 22 క్యారెట్ల ధర రూ. 1,06,000 గా ఉంది carat .

Gold and Silver Rates | స్థిరంగా ధ‌ర‌లు..

హైదరాబాద్‌, విజయవాడ Vijaywada నగరాల్లో కూడా 24 క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,480 గా ఉండగా, 22 క్యారెట్ల ధర రూ. 1,05,850 గా ఉంది. మరోవైపు వెండి ధరలు నిన్నటి స్థాయిలోనే కొనసాగుతున్నాయి.

దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఈ తరహాలో పెరుగుతున్న నేపథ్యంలో వినియోగదారులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. దేశంలోని ప్ర‌ధాన న‌గ‌రాల‌లో బంగారం ధ‌ర‌లు ఎలా ఉన్నాయ‌నేది చూస్త.. 24 క్యారెట్లు (24 carat gold price), 22 క్యారెట్ల(22 carat gold price) ప‌రంగా..

  • ఢిల్లీలో రూ. 1,15,630 – రూ. 1,06 000
  • ముంబయిలో రూ. 1,15,480 – రూ. 1,05,850
  • వడోదరలో రూ. 1,15,530 – రూ. 1,05,900
  • కోల్‌కతా KOLKATA లో రూ. 1,15,480 – రూ. 1,05,850
  • చెన్నైలో రూ. 1,15,480 – రూ. 1,05,850
  • బెంగళూరులో రూ. 1,15,480 – రూ. 1,05,850
  • కేరళలో రూ. 1,15,480 – రూ. 1,05,850
  • పుణెలో రూ. 1,15,480 – రూ. 1,05,850

ఇక దేశంలోని ప్రధాన నగరాల్లో వెండి ధరలు Silver Prices (కేజీకి) చూస్తే…

  • హైదరాబాద్‌లో రూ. 1,59,000
  • విజయవాడలో రూ. 1,59,000
  • ఢిల్లీలో రూ. 1,49,000
  • చెన్నైలో రూ. 1,59,000
  • కోల్‌కతాలో రూ. 1,49,000
  • కేరళలో రూ. 1,59,000
  • ముంబయిలో రూ. 1,49,000
  • బెంగళూరులో రూ. 1,49,000
  • వడోదరలో రూ. 1,49,000
  • అహ్మదాబాద్‌లో రూ. 1,49,000
Must Read
Related News