అక్షరటుడే, వెబ్‌డెస్క్ : Gold Rates | భారతీయ మార్కెట్లో బంగారం ధరలు (Gold Prices) రోజురోజుకీ గరిష్ట స్థాయిని చేరుతున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం, పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తి అయిన బంగారం వైపు మొగ్గు చూపుతుండడంతో పసిడి ధరలు పైపైకి పోతున్నాయి. నేడు (సెప్టెంబర్ 11) బంగారం ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే.. 24 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 1,10,520గా ట్రేడ్ కాగా, 22 క్యారెట్ల బంగారం (10 గ్రాములు) 1,01,310గా నమోదైంది. ఇక ఢిల్లీ (Delhi) మార్కెట్ రేట్లు చూస్తే.. 24 క్యారెట్లు (10 గ్రాములు) రూ.1,10,670గా నమోదు కాగా, 22 క్యారెట్లు (10 గ్రాములు) రూ.1,01,460గా ట్రేడ్ అయింది.
Gold Rates | భగ్గుమంటున్న బంగారం..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు): హైదరాబాద్ (Hyderabad) రూ.1,10,520 (24కే), రూ.1,01,310 (22కే); విజయవాడ రూ.1,10,520, రూ.1,01,310; ఢిల్లీ–రూ.1,10,670, రూ.1,01,460; ముంబై–రూ.1,10,520, రూ.1,01,310; వడోదర–రూ.1,10,570, రూ.1,01,360; కోల్‌కతా–రూ.1,10,520, రూ.1,01,310; చెన్నై–రూ.1,10,520, రూ.1,01,310; బెంగళూరు–రూ.1,10,520, రూ.1,01,310; కేరళ–రూ.1,10,520, రూ.1,01,310; పుణె–రూ.1,10,520, రూ.1,01,310 గా ట్రేడ్ అయింది.
ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (Silver Prices) (కేజీకి): హైదరాబాద్–రూ.1,39,900; విజయవాడ–రూ.1,39,900; ఢిల్లీ–రూ.1,29,900; చెన్నై–రూ.1,39,900; కోల్‌కతా–రూ.1,29,900; కేరళ–రూ.1,39,900; ముంబై–రూ.1,29,900; బెంగళూరు–రూ.1,29,900; వడోదర–రూ.1,29,900; అహ్మదాబాద్–రూ.1,29,900గా ట్రేడ్ అయింది. ఇక ఈ రోజు వెండి ధరలు మాత్రం స్వల్పంగా తగ్గాయి. నిన్నటితో పోల్చితే కిలోకు రూ.100 తగ్గి ట్రేడవుతున్నాయి. బంగారం ధరలు మాత్రం రోజు రోజుకి పైకి పోతుండడం సామాన్యులకి ఏ మాత్రం మింగుడు పడడం లేదు. మొన్నటి వరకు 22 క్యారెట్స్ బంగారం ధరలు లక్షలోపే ఉండేవి. కానీ ఇప్పుడు అవి కూడా ఆకాశాన్ని అంటుతున్నాయి.