అక్షరటుడే, వెబ్‌డెస్క్: Gold Price on sep 1 : ఈ మధ్య బంగారం ధరలు Gold Prices పరుగులు పెడుతున్నాయి. తగ్గినట్టే తగ్గి అంతలోనే ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి.
ఈ ధరలకి సామాన్యుడు బంగారం వైపు చూడాలంటేనే వెనుకంజ వేసే పరిస్థితి ఉంది. ఒకప్పుడు బంగారం కొనడానికి చాలా మంది ఆసక్తి చూపే వారు.
కానీ ఇప్పుడు బంగారం అంటేనే భయపడే పరిస్థితి వచ్చింది. రోజురోజుకు తులం బంగారంపై వందల రూపాయలు పెరుగుతూ పోతోంది.
సెప్టెంబరు 1వ తేదీన ఢిల్లీలో తులం ధర లక్షా 5 వేల రూపాయలు దాటి అందరి గుండెల్లో భయం పుట్టిస్తోంది.
దేశీయంగా 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,940 ఉండగా.. 22 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ. 96,190 గా ట్రేడ్ అయింది.
Gold Price on sep 1 : భగ్గుమంటున్న బంగారం..
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 1,05,090గా నమోదు కాగా, 22 క్యారెట్ల గోల్డ్ ధర 10 గ్రాములకు రూ. 96,340గా ట్రేడ్ అయింది.
ఇక హైదరాబాద్, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,04,940కి చేరుకోగా, 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ. 96,190గా నమోదైంది.
వెండి ధరలు నిన్నటితో పోల్చుకుంటే వంద రూపాయల మేర తగ్గడంతో కాస్త ఉపశమనం లభించింది. ఈ క్రమంలో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయనేది చూస్తే..
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) (gold market updates)….
- హైదరాబాద్‌లో రూ. 1,04,940 – రూ.96,190
- విజయవాడలో రూ.1,04,940 – రూ. 96,190గా ట్రేడ్ అయింది.
- ఢిల్లీలో రూ.1,05,090 – రూ.96,340
- ముంబయిలో రూ.1,04,940 – రూ.96,190
- వడోదరలో రూ.1,04,990 – రూ.96,240
- కోల్‌కతాలో Kolkata రూ.1,04,940 – రూ. 96,190
- చెన్నైలో రూ.1,04,940 – రూ.96,190
- బెంగళూరులో రూ.1,04,940 – రూ.96,190
- కేరళలో రూ.1,04,940 – రూ.96,190
- పుణెలో రూ. 1,04,940 – రూ.96,190గా ట్రేడ్ అయింది.
ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) చూస్తే..
- హైదరాబాద్‌లో రూ.1,34,900
- విజయవాడలో రూ.1,34,900
- ఢిల్లీలో రూ.1,24,900
- చెన్నైలో రూ.1,34,900
- కోల్‌కతాలో రూ.1,24,900
- కేరళలో రూ.1,34,900
- ముంబైలో రూ.1,24,900
- బెంగళూరు, ముంబైలో రూ.1,24,900
- వడోదర, ముంబయిలో రూ.1,24,900
- అహ్మదాబాద్, ముంబయిలో రూ.1,24,900గా ట్రేడ్ అయింది.