అక్షరటుడే, హైదరాబాద్: Today Gold Prices | దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం, వెండి ధరలు మళ్లీ పెరిగాయి. అక్టోబరు 09న 24 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ. 1,23,940 గా నమోదు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర రూ. 1,13,610 గా ట్రేడ్ అయింది. పండగ సీజన్‌లో ఇలా పెరగడం మహిళలకి షాకింగ్‌గా మారింది.
బంగారం ధరలు Gold Price కొత్త రికార్డులను నమోదు చేస్తున్నాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, గ్లోబల్ ఆర్థిక అనిశ్చితులు పెరగడంతో పెట్టుబడిదారులు సురక్షిత ఆస్తిగా పసిడిని భావించి దానిపై దృష్టి సారిస్తున్నారు.
డాలరుతో పోల్చితే రూపాయి క్షీణించడం కూడా బంగారం ధరల పెరుగుదలకు కారణమవుతోంది. ఈ నేపథ్యంలో ఈ రోజు (అక్టోబరు 9) బంగారం రేట్లు భారీగా పెరిగాయి.
దేశ రాజధాని ఢిల్లీలో 24 క్యారెట్ల (24 carat) పసిడి ధర 10 గ్రాములకు రూ. 1,24,090 గా ఉండగా, 22 క్యారెట్ల బంగారం (22 carat gold) ధర రూ. 1,13,760 గా నమోదైంది. హైదరాబాద్, విజయవాడలో కూడా బంగారం ధరలు రికార్డు స్థాయికి చేరాయి.
Today Gold Prices | పైపైకి పోతున్న ధరలు..
ఈ పెరుగుదలతో ఆభరణాల కొనుగోలు దారులు, పెట్టుబడిదారులు ఒక్కసారిగా అప్రమత్తమవుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్లో కూడా బంగారం ఔన్సు ధర 2,470 డాలర్లకు చేరి, గత వారం కంటే సుమారు 1.2 శాతం అధికంగా ఉంది.
ప్రపంచవ్యాప్తంగా మధ్యప్రాచ్య ఉద్రిక్తతలు, చమురు ధరల ఊగిసలాటలతో పాటు అమెరికా ఆర్థిక డేటా బలహీనత కూడా బంగారం ధరలను ప్రభావితం చేస్తున్నట్లు నిపుణులు చెబుతున్నారు.
మరోవైపు వెండి ధరలు Silver Price కూడా పెరుగుతున్నాయి. నిన్నటితో పోలిస్తే వెండి ధర కిలోకు రూ.100 మేర పెరిగి రూ.1,70,010కి చేరింది.
నవరాత్రి, దీపావళి Diwali పండుగల సీజన్‌లో ఈ పెరుగుదల ఆభరణాల వ్యాపారంపై ప్రభావం చూపే అవకాశం ఉందని మార్కెట్ విశ్లేషకులు పేర్కొంటున్నారు.
దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్) ఇలా ఉన్నాయి:
- హైదరాబాద్‌లో రూ. 1,23,940 – రూ. 1,13,610
- విజయవాడలో రూ. 1,23,940 – రూ. 1,13,610
- ఢిల్లీలో రూ. 1,24,090 – రూ. 1,13,760
- ముంబయిలో రూ. 1,23,940 – రూ. 1,13,610
- వడోదరలో రూ. 1,23,990 – రూ. 1,13,660
- కోల్‌కతాలో రూ. 1,23,940 – రూ. 1,13,610
- చెన్నైలో రూ. 1,23,940 – రూ. 1,13,610
- బెంగళూరులో రూ. 1,23,940 – రూ. 1,13,610
- కేరళలో రూ. 1,23,940 – రూ. 1,13,610
- పుణెలో రూ. 1,23,940 – రూ. 1,13,610 గా ఉన్నాయి.
ఇక ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి) ఇలా ఉన్నాయి..